Keerthi Suresh : 1000 కోట్ల హీరోతో మహానటి…బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా

website 6tvnews template 2024 04 03T124530.908 Keerthi Suresh : 1000 కోట్ల హీరోతో మహానటి…బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా

సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthi Suresh)లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మహానటి మూవీ తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. కీర్తి సురేష్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కు జోడీగా నటించే ఛాన్స్ దక్కింది. దీంతో సో సో గా ఉన్న తన కెరీర్ మలుపు తిరిగే అవకాశం దక్కినట్లైంది.

WhatsApp Image 2024 04 03 at 12.29.34 PM Keerthi Suresh : 1000 కోట్ల హీరోతో మహానటి…బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా

ప్రభాస్‎కు జోడీగా కీర్తి :

కీర్తి సురేష్ (Keerthi Suresh) ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ కు చెందిన స్టార్ కిడ్. కీర్తి తల్లిదండ్రులిద్దరీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. దీంతో బాలనటిగా మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సొంత భాష‌ మలయాళంలో ‘గీతాంజలి’ (geethanjali) మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళం ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. నాగ్ అశ్విన్ (Nag Aswin) డైరెక్షన్ లో వచ్చిన మహానటి (Mahanati) సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది కీర్తి సురేశ్.

ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని తన యాక్టింగ్ కి గాను జాతీయ పురస్కారం కూడా లభించింది. ఆ తర్వాత ఈ హీరోయిన్ ఓరియెంటెడ్, కమర్షియల్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది. ఈ మధ్యనే నాని (Nani)హీరోగా వచ్చిన దసరా (Dasara) మూవీలో మాస్ యాక్షన్ తో అదరగొట్టింది కీర్తి. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కీర్తికి ప్రభాస్ (Prabhas) సినిమాలో ఛాన్స్ దక్కింది.

ప్రభాస్‎ను కొత్తగా చూపిస్తాడా? :

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ (Sandeep Vanga)అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మొన్నటికి మొన్న యానిమల్ (Animal) సినిమాతో దేశాన్నే ఓ ఊపు ఊపేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కళ్లుతిరిగే కలెక్షన్లను రాబట్టింది. దాంతో సందీప్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas)తో చేయబోయే స్పిరిట్ (Spirit) సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మూవీలో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రభాస్ క్యారెక్టర్ ఈ మూవీలో సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

WhatsApp Image 2024 04 03 at 12.28.56 PM Keerthi Suresh : 1000 కోట్ల హీరోతో మహానటి…బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా

ఇదిలా ఉండగా.. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా యానిమల్ బ్యూటీస్ నటించనున్నారనే రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా తెరమీద మహానటి పేరు గట్టిగా వినిపిస్తోంది. స్పిరిట్ లో ప్రభాస్ కు జోడిగా కీర్తి సురేష్ (Keerthi Suresh)ను తీసుకోబోతున్నారనే న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ న్యూస్ నిజమైతే కీర్తి ఖాతాలో మరో హిట్ పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం నాగ్ అశ్విన్ (Nag Aswin) డైరెక్ట్ చేస్తున్న కల్కి (kalki) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వాస్తవానికి ఈ మూవీ మే లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే డార్లింగ్ రాజాసాబ్ (Rajasaab), సలార్ 2 (Salaar2), స్పిరిట్ (Spirit), హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో వస్తున్న సినిమాలు చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో కల్కి తర్వాత లైన్ లో ఉన్న స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment