ఒకప్పుడు చిన్న హీరోలతో సినిమాలంటే స్టార్ హీరోయిన్లు అస్సలు ఒప్పుకునేవారు కాదు. అదో ప్రెస్టీజ్ లా ఫీల్ అయ్యే వారు. తమ ఇమేజ్ లో సగం కూడ లేని నటులతో నటించడం ఏంటి అని నిస్సందేహంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురూ. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇప్పుడు ఇలాంటి డైలాగులు ఎక్కడా కూడా వినిపించడం లేదు. మేకర్స్ చెప్పడమే ఆలస్యం స్టార్ హీరోయున్లు ఎంచక్కా చిన్న హీరోలతో జోడీ కడుతున్నారు. తెరమీద సందడి చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నన ట్రెండే ఇది. తాజాగా సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇప్పుడు మరోసారి అదే పని చేస్తోంది. ఓ కుర్ర కామెడీ హీరోతో జోడీ కట్టబోతోంది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
నక్కతోక తొక్కిన సుహాస్ :
సినిమాల్లో కొన్ని కాంబినేషన్లను అస్సలు ఇమాజిన్ చేయలేము. అలాంటి ఓ కాంబోనే ఇది. హాస్య నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా మారి తనకంటూ క్రేజ్ తెచ్చుకున్నాడు సుహాస్. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడు ఇదే సుహాస్ త్వరలోనే స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh)తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఉప్పు కప్పురంబు’ (uppu kappurambu) అనే ఓ మూవీ తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమా మాత్రం థియేటర్లలో విడుదల కావడం లేదు. దీనిని మేకర్స్ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ కోసం రూపొందిస్తున్న మూవీ ఇది.
అందుకే మహానటి ఒప్పుకుంది :
ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఈ మూవీని అని ఐవి శశి (Ani IV Sashi)డైరెక్ట్ చేస్తున్నాడు. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Ellanor Films Private Limited)బ్యానర్ పై రాధికా లావు (Radhika Lavu) ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. స్టోరీని మురళీకృష్ణ (Muralikrishna)అందించారు. సెటైరికల్ కామెడీ జోనర్‌లో
ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్‌కి అదరిపోయే రోల్ ఆఫర్ చేశారట. అందుకే మహానటి ఈ సినిమాకు సైన్ చేసిందని సమాచారం.
ఇక కొత్త ప్రాజెక్ట్ గురించి తెలియడంతో సుహాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్-సుహాస్ జోడీగా కనిపిస్తారా లేదా మెయిన్ క్యారెక్టర్లలో నటిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా సుహాస్ కెరీర్‌కి ఇది మంచి బూస్ట్ అని చెప్పవచ్చు.
టాలీవుడ్ టూ బాలీవుడ్ :
కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటిస్తుంది. ప్రస్తుతం రఘుతాత (Raghutatha), కన్నివేడి (Kannivedi), రివాల్వర్ రీటా (Revolver Rita)వంటి మూవీస్ చేస్తోంది కీర్తి సురేష్. తమిళ సినిమా ‘తేరి’ (Theri)రీమేక్ అయిన ‘బేబీ జాన్’ (Baby John) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది.