King Khan is ready for Hat-Trick: హ్యాట్రిక్ కొట్టేందుకు కింగ్ ఖాన్ రెడీ..
2023 పూర్తిగా బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నామ సంవత్సరం అనే చెప్పాలి. ఒక మంచి సాలిడ్ హిట్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న షారుక్ కి ఈ ఏడాది బంపర్ ఆఫర్ తగిలింది.
షారుక్ నటించిన వరుస సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. బాలీవుడ్ బ్యూటీ దీపికాతో నటించిన పటాన్, లేడీ సూపర్ స్టార్ నయనతారతో చేసిన జవాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసాయి.
లేటెస్ట్ గా బాలీవుడ్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ రూపొందించిన డంకీ సినిమా వెండితెరపైన ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డంకీ కూడా హిట్టు కొడితే షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ ఖాయం. మరి ఈ సినిమాతో షారుక్ ఖాన్ రూ.1000 కోట్లు కొల్లగొడతారా?
పఠాన్, జవాన్ ల మాదిరిగా మరోసారి రికార్డును రిపీట్ చేస్తారా? సలార్ లాంటి డైనోసర్ ముందుండగా.. బాద్షా ప్రభాస్ ను తట్టుకుని నిలబడతారా..? డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ఈ సారి ఏం చెప్పబోతున్నారు..?
ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే నా మాట నేనే విననంటూ 2023లో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారు షారుఖ్ ఇక అన్నీ అనుకున్నట్లుగానే డిసెంబర్ 21న డంకీ రిలీజ్ కాబోతుంది.
రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.ట్రైలర్ చూడ్డానికి కామెడీగా ఉన్నా..ఇన్సైడ్ సీరియస్ స్టోరీ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రాజ్ కుమార్ సినిమా కాబట్టి. షారుక్ మూవీస్ రిలీజ్ డేట్స్ లో కూడా సర్వమత సమ్మేళనం కనిపిస్తుంది.
ఇదే సెంటిమెంట్‌తో కింగ్ ఖాన్ జనవరి 26 రిపబ్లిక్ డే రోజున పఠాన్‌తో వచ్చి దుమ్ముదులిపాడు. కృష్ణుని జన్మాష్టమికి జవాన్ అంటూ రెండోసారి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కొల్లగొట్టారు.
ఇక ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డంకీతో వచ్చి ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలనీ చూస్తున్నారు షారుక్.
ఇక డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ అంటేనే బ్రాండ్.. ఆయన చేయి పడితే రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే . మున్నాభాయ్, పీకే, 3 ఇడియట్స్, సంజు వంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు హిరాణీ.
అలాంటి డైరెక్టర్ తో షారుక్ వంటి స్టార్ జతకడితే .. ఎదురుగా ఏ సినిమా ఉన్నా నిలుస్తుందా..? అయితే ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ డంకీకి డైనోసర్ అడ్డుగా ఉంది.మరి ఈ మూవీ డంకీని ఎలా అడ్డుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది .
తన ప్రతీ మూవీలో సోషల్ మెసేజ్ ఇస్తారు హిరాణీ. ఇక డంకీ మూవీ లండన్ వెళ్లాలనుకునే 5గురు ఫ్రెండ్స్ స్టోరీ. ఇందులో ప్రధానంగా ఇంగ్లీష్ గురించి టాపిక్ తీసుకున్నారు.
డైరెక్టర్ ఈ స్టోరీని ముందుగా ఎంటర్‌టైనింగ్‌గా మొదలుపెట్టి.. సీరియస్‌గా లోతుకు వెళ్లారని ట్రైలర్ చూసి చెప్పవచ్చు.
సో దీన్ని బట్టి చూస్తుంటే సలార్,డంకీ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేయడం ఖాయంగా తెలుస్తోంది.మరి ఈ రెండిట్లో ఏ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.