Kite Festival in Secunderabad from Today: అంబరానంటుతున్న కైట్స్ ఫెస్టివల్

Kite Festival in Secunderabad from Today:

Kite Festival in Secunderabad from Today: సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలను తెచ్చేస్తుంది. ఇంటికి వచ్చే బంధువులతో ఇల్లు కళకళ లాడుతూ ఉంటుంది. ప్రతి ఇంటి ద్వారం బంతి పూలు మామిడి తోరణాలతో అలంకరించి శుభప్రదంగా శోభాయమానంగా కాంతులీనుతుంది.

హిందువుల పండుగల్లో ఏ పండుగకు లేని విశిష్టత ఈ పండుగకు మాత్రమే ఎందుకు ఉంటుందంటే ఇది అచ్చమైన స్వచ్ఛమైన రైతుల పండుగ. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి(Bhogi), సంక్రాంతి(Sankranti), కనుమ(Kanuma).

అయితే ఈ మూడు పండుగల ముందు మనకి బాగా ఎక్కువగా కనిపించేవి పతంగులు. చిన్న పిల్లల నుండి, కుర్రకారు, పెద్దవారు కూడా పోటీ పడి మరీ పతంగులు ఎగురవేస్తారు. ఈ గాలి పటాల సందడి కూడా బాగానే ఉంటుంది సంక్రాంతి వేళ.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గాలిపటాలు ఎగురవేసే వారు ఎక్కువగా ఉంటారు. ఎవరి పతంగి బాగా ఎక్కువ దూరం వెళితే వారే గెలిచినట్టు గా భావిస్తారు. ఈ క్రమం లోనే హైదరాబాద్(Hyderabad) లోని పెరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్(Kite Festival) ను నిర్వహిస్తున్నారు.

ఏయే మార్గాలు మూసివేశారంటే : Which Roads Were Closed

Kite Festival in Secunderabad from Today:

ఈ కైట్ ఫెస్టివల్ ను జనవరి 13వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. దీనికి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్(International Kites And Sweets Festival) గా పేరు పెట్టారు. దీని కోసం తెలంగాణ పోలీసు శాఖ, ట్రాఫిక్ పోలీసు శాఖ అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ కైట్ వెస్టివల్(Kites Festival) జరుగుతున్న క్రమంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌(Secundrabad Pared Grounds) వాపు వెళ్లే వాహనదారులకు కొన్ని సూచనలు చేశారు. ప్రతి రోజు ఈ మార్గంలో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణం సాగించాలని కోరారు.

టివోలి క్రాస్‌ రోడ్డు(Tivoli Cross Roads) నుంచి ప్లాజా ఎక్స్‌ రోడ్డు9Plaza Cross Roads) వరకు రోడ్డును పూర్తిగా మూసి వేశారు. అలుగడ్డబావి ఎక్స్‌ రోడ్స్‌, సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్స్‌, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌, ఫ్లాజా, సీటీఓ, బ్రూక్‌ బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్స్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌, తాడ్‌బన్‌ క్రాస్‌ రోడ్స్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, బోయిన్‌పల్లి ఎక్స్‌ రోడ్స్‌, రసూల్‌పురా, బేగంపేట్‌, పారడైజ్‌ రూట్లలో ఆంక్షలు ఉండనున్నాయి.

ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి రాష్ట్రి పది గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి.

మెట్రో ను ఆశ్రయించడం ఉత్తమం : Metro Is The Better option

Kite Festival in Secunderabad from Today:

అయితే ఇది సంక్రాంతి సమయం, కాబట్టి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వారు తమ తమ సొంత ఊళ్లకు వెళ్లే వారు రైల్వే స్టేషన్ కి(Secundrabad Railway Station) జూబ్లీ బస్టాండ్(Jubli Bus Stand) కి వెళ్లాలనుకుంటే మెట్రోను(Hyderabad Metro) ఆశ్రయించడం ఉత్తమని అంటున్నారు.

లేదా ఎంఎంటీఎస్ సేవలు(MMTS Trains) ఉపయోగించుకుంటే నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకే వెళ్లి అక్కడే రైలు అందుకునే వీలు కూడా ఉంటుందని చెబుతున్నారు.

కాబట్టి ఈ మార్గంలో వెళ్లేవారు వారి ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇక ఈ కైట్ ఫెస్టివల్ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్స్ వద్ద వాహనాల పార్కింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించారు పోలీసులు.

Leave a Comment