విరాట్ కోహ్లీ.. టీమ్ ఇండియా రన్ మెషిన్ గా బిరుదు సంపాదించుకున్న ఇతగాడు, ఆటతో మాత్రమే కాదు తన ప్రవర్తనతో కూడా క్రికెట్ అభిమానులను అలరిస్తూ ఉంటాడు.
విరాట్ క్రీజ్ లో ఉన్నప్పుడు రాటు కొట్టుడు కొట్టడమే కాదు, మైదానంలో ఉన్నప్పుడు తోటి ఆటగాళ్లను హుషారెత్తిస్తూ ఉంటాడు. కేవలం ఆటగాళ్లతో మాత్రమే కలుపుగోలుగా ఉంటాడు అనుకుంటే పొరపాటే, స్టేడియంలోని గ్యాలరీలో కూర్చున్న ఫాన్స్ తో కూడా యిట్టె కలిసిపోతాడు కోహ్లీ.
సమయం సందర్భం కుదిరినప్పుడల్లా ఫాన్స్ కి అభివాదం చేస్తాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు. కుదిరితే రెండు స్టెప్పులు కూడా వేస్తాడు విరాట్. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి కాలు కదిపాడు కోహ్లీ.
ఆ సీన్ మైదానంలోనే చోటుచేసుకుంది. ఇక తాజాగా మరోసారి కూడా కోహ్లీ ఓ సాంగ్ కి స్టెప్స్ వేశాడు. అయితే అది ఓల్డ్ హిందీ సినిమాలోని పాట. అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ నటించిన రామ్ లఖన్ సినిమాలోని పాట ఇది.
మై నేమ్ ఈస్ లఖన్ అంటూ గాలరీలోని అభిమానులు పాడటం మొదలు పెట్టారు. ఆపాట కోహ్లీ విన్నాడు, కాస్త వినసొంపుగా లయబద్దంగా హుషారుగా పాట పడటంతో కొల్లీ తనను తానూ నియంత్రించుకోలేకపోయాడు. ఇంకేముంది పాటకి తగ్గట్టు రెండు స్టెప్పులేశాడు.
మరి కోహ్లీ స్టెప్పులేయడం అంటే చిన్న విషయం కాదుకదా ? సో దానిని గ్యాలరీలో వారు వీడియో తీశారు. ఆ వీడియోను సమాజిక మధ్యమలలో పంచుకోగా ఇప్పుడు అది బాగా వైరల్ గా మారింది.