Daniel Balaji : గుండెపోటుతో ప్రముఖ విలన్ మృతి

website 6tvnews template 2024 03 30T110257.432 Daniel Balaji : గుండెపోటుతో ప్రముఖ విలన్ మృతి

తనదైన విలనిజంతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ప్రముఖ కొలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ ( daniel balaji)హార్ట్ అటాక్ తో కన్నుమూశారు.. శుక్రవారం అర్థరాత్రి గుండెనొప్పి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచారు..48 ఏళ్ల డేనియల్ మరణం సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక అద్భుతమైన నటుడిని ఇండస్ట్రీ కోల్పోయిందని సినీ సెలబ్రిటీలు , ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పలువురు డేనియల్ కు సంతాపం తెలిపారు.

తెలుగులో అదే చివరి సినిమా :

డేనియల్ బాలాజీ ( daniel balaji) ఎన్టీఆర్ (NTR)నటించిన సాంబ (Samba) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ సినిమాతోనే మంచి డేనియల్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఘర్షణ (Gharshana), చిరుత(Chirutha), సాహసం శ్వాసగా సాగిపో (Sahasam Swasaga Sagipo) సినిమాల్లో కీ రోల్ లో నటించారు.

WhatsApp Image 2024 03 30 at 10.54.52 AM 1 Daniel Balaji : గుండెపోటుతో ప్రముఖ విలన్ మృతి

నాని (Nani) హీరోగా నటించిన టక్ జగదీష్ (Tuk Jagadeesh) సినిమాలోనూ మెయిన్ విలన్ గా తన నటనతో ప్రేక్షకాధరణ పొందారు. తెలుగులో డేనియల్ నటించిన లాస్ట్ మూవీ ఇదే. తెలుగులో తక్కువ సినిమాల్లో కనిపించినా తనదైన యాక్టింగ్ తో ఫేమస్ అయ్యాడు. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ రోల్స్ చేసి హీరోకు సమానమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు.

చెన్నైలో అంత్యక్రియలు :

డేనియల్ బాలాజీ ( daniel balaji) ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూజర్ సిద్దలింగయ్య (Sidda Lingayya)సోదరి కొడుకు. చెన్నైలోని తారామణి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ (Taramani Film Institute)లో డైరెక్షన్ కోర్సు కంప్లీట్ చేశాడు. ఫిలిం మేకర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు డేనియల్. కానీ అనుకోని రీతిలో విలన్ గా సెటిల్ అయ్యాడు. 2001లో చితి (Chithi)అనే సీరియల్‏తో టెలివిజన్ నుంచి తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మధతిల్ (April Madhatil)మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు.

డైరెక్టర్ గౌతమ్ మీనన్ (Gowtham Menon)దర్శకత్వంలో విడుదలైన కాకా (Kaka), ఫ్రాధు ఫ్రాదు (Faadru Faadru) సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించాడు. డేనియల మరణం కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ప్రముఖులు ఓ వైపు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.. ఈరోజు చెన్నైలోని పురసైవల్కంలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు

Leave a Comment