Thalapathy vijay: వామ్మో…విజయ్ ఒక్క సినిమాకు అన్ని కోట్లా ?

website 6tvnews template 2024 03 22T114916.417 Thalapathy vijay: వామ్మో…విజయ్ ఒక్క సినిమాకు అన్ని కోట్లా ?

తమిళనాడులో స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy vijay)కి ఉన్న క్రేజే వేరు. తన నటనతో సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా టాప్ హీరోగా రాణిస్తున్నారు విజయ్. ప్రజలకు ఈయనంటే వల్లమాలిన ప్రేమ. తమిళంలోనే కాదు తెలుగులోనూ విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే విజయ్ నటించిన లియో మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu)డైరెక్ట్ చేస్తున్నా ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు విజయ్. అంతే కాదు మరో ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీ విజయ్ లాస్ట్ మూవీ కావడంతో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు చెక్ :

సినిమాల విషయం పక్కన పెడితే రీసెంట్‎గా దళపతి విజయ్ (Thalapathy vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన పార్టీ పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. పలు సమాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాడు. ప్రజల కష్టాలను తీర్చేందుకే పార్టీ పెడుతున్నట్లు చెప్పి తమ లక్ష్యం ఏంటో తెలిపాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీతో త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారంటూ టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో విజయ్ చివరి సినిమా గురించి కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ తన 68వ చిత్రంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) చేస్తున్నాడు. ‘దళపతి 69’ (Thalapathy 69 ) విజయ్‌కి లాస్ట్ మూవీ అని తెలుస్తోంది. అయితే ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‎గా మారింది. అంతే కాదు ఈ సినిమా కోసం విజయ్ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది.

లియో బిజినెస్ రూ.600 కోట్లు :

దళపతి విజయ్ (Thalapathy vijay)నటించే చిత్రాలన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేసి భారీ వసూళ్లను రాబడతాయి. రీసెంట్ గా విజయ్ నటించిన ‘లియో’(Leo) మూవీ ఆవరేజ్ అయినా వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్ల బిజినెస్ చేసింది. ఇంత పెద్దమొత్తంలో బిజినెస్ జరగడం అంత ఈజీ విషయం కాదు. థియేటర్లలోనే కాదు టీవీ, ఓటీటీ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. అంత క్రేజ్ ఉంది కాబట్టి మేకర్స్ కూడా విజయ్‌కి భారీ పారితోషికం ఇవ్వడానికి వెనకాడరు. ఎంతలేదన్నా విజయ్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటాడని టాక్.

రూ.250 కోట్ల రెమ్యునరేషన్ :

లేటెస్టుగా ‘GOAT’సినిమాకు రూ.200 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నాడట విజయ్ . ఇక తాను నటించే లాస్ట్ మూవీకి రూ. 250 కోట్ల పారితోషికం తీసుకుంటాడని కోలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. విజయ్ చివరిగా నటించే మూవీ కావడంతో ఈ సినిమాకు ఆయన ఫ్యాన్స్ భారీగా రావడం కన్ఫార్మ్. ఎలాగైనా అభిమానులు ఈ సినిమాను భారీ హిట్ చేస్తారు. ఇదిలా ఉంటే విజయ్ లాస్ట్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) ప్రొడ్యూజర్ డీవీవీ దానయ్య (DVV Danayya)ఈ మూవీని నిర్మించేందుకు ముందుకొచ్చారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్స్ హెచ్. వినోద్ (Vinod) లేదా అట్లీ (Atlee) డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Comment