KTR Auto Journey Video Viral: ఆటో ఎక్కిన కేటీఆర్ – వైరల్ అయిన వీడియో

website 6tvnews template 2024 01 27T155907.078 KTR Auto Journey Video Viral: ఆటో ఎక్కిన కేటీఆర్ - వైరల్ అయిన వీడియో

KTR Auto Journey Video Viral : మాజీ మంత్రి, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరమవు(KTR) ఏది చేసినా సెన్సేషన్ గానే ఉంటుంది.

ప్రతుతం అయన ఆటతో లో ప్రయాణించి మరో సారి సంచలనానికి తెరలేపారు. ప్రస్తుతం భారతీయ రాష్ట్ర సమితి(Bharatiya Rahtra Samiti) పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది.

ఎన్నికలకు కేవలం ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్(Hyderabad) నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ భవన్ కు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

యూసఫ్ గూడ టు తెలంగాణ భవన్ – From Yusafguda To Telangana Bhavan

KTR Auto KTR Auto Journey Video Viral: ఆటో ఎక్కిన కేటీఆర్ - వైరల్ అయిన వీడియో

ఇది ఇలా ఉంటె నేడు కూడా యూసఫ్ గూడ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.

అయితే సమావేశం అనంతరం కేటీఆర్ యూసఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ కి వెళ్లేందుకు బయలుదేరారు, కానీ సడన్ గా అయన తన కారులో కాకుండా ఆటో ఎక్కారు. మాజీ మంత్రి తన కారు విడిచి సామాన్య ప్రజల మాదిరిగా ఆటో ఎక్కడంతో ఇది సంచలనంగా మారింది.

ఈ సీన్ ను చాల మంది తమ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈసారి తలసానికి హ్యాండిచ్చినట్టేనా :

ఇక జూబ్లీహిల్స్ ప్రాంతం చుస్తే ఇది సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఈ స్థానంలో తలసాని సాయికిరణ్ యాదవ్ (Talasani Sai Kiran Yadav)పోటీకి నిలబడ్డారు.

అయితే అయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కాబట్టి ఈ దఫా ఎన్నికల్లో సికంద్రాబాద్ లోక్ సభ స్థానం అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.

సాయికిరణ్ కి బదులుగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తున్నారట.

ఇక తలసాని సాయి కిరణ్ యాదవ్ అంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) కుమారుడే.

Leave a Comment