KTR: కేటీఆర్ పై నెటిజన్ల మనోగతం..ఇది తెలిస్తే కేటీఆర్ ఏమంటాడో.

Netizens love KTR..What would KTR say if he knew this.

కేటీఆర్ పై నెటిజన్ల మనోగతం.. ఇది తెలిస్తే కేటీఆర్ ఏమంటాడో.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణా ప్రజా తీర్పు సుస్పష్టంగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. గులాబీ పార్టీ చేతిలో ఉన్న అధికార పగ్గాలను లాక్కుని హస్తం పార్టీకే అప్పజెప్పారు. అయితే ఇప్పడు ఒక విషయం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో బి. ఆర్.ఎస్ పార్టీ ఓడిపోవడం, ఆ పార్టీ అధికారం కోల్పోవడం వల్ల మంత్రిగా అధికారాన్ని చేజార్చుకున్న కేటీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించే సర్వత్రా చర్చ నడుస్తోంది.

అంతలా అయన గురించి చర్చించాల్సిన అవసరం ఏముంది, బి.ఆర్.ఎస్ పాలన సమయంలో అయన వేసిన ప్రత్యేకమైన ముద్ర ఏంటి అని అనుమానం రావచ్చు. దానికి చెప్పే ఒకేఒక్క పెద్ద సమాధానం ఐటీ శాఖా.

బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ గా కన్నా ఐటీ శాఖా మంత్రిగా పని చేసిన కేటీఆర్ ఎనలేని ఖ్యాతి చెచ్చుకున్నారు. ఆయన హయాం లో తెలంగాణ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి.

తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ ఉద్యోగ అవకాశాలు కేవలం తెలంగాణ రాష్ట్ర యువతకు మాత్రమే పరిమితం కాలేదు అని గుర్తు చేసుకోవాలి.

నిత్యం పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్ వచ్చే అనేక రాష్ట్రాల యువతకి హైదరాబాద్ బ్రతుకు తెరువు అవుతోందన్నది కాదనలేని నిజం. ఈ హైదరాబాద్ మహానగరంలో అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల ప్రజలు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరానికి ఇంతమంది వస్తున్నా ఎవరికీ లోటు లేకుండా ఉపాధి దొరుకుతుంది అంటే అందుకు కారణం ఇక్కడ ఉన్న కంపెనీలు, ఆ కంపెనీల యాజమాన్యాలకు తెలంగాణ రాష్ట్రం చాలా అనుకూలమైన ప్రాంతం.

అని ఇక్కడ మాన్ పవర్ కి కొదువ ఉండదని, నీరు, విద్యుత్ వంటివి నిరంతరం అందుబాటులో ఉంటాయనే భరోసాను కల్పించే బాధ్యతను ప్రభుత్వంమే తప్పక తీసుకోవాలి.

అలా తీసుకున్నారు కాబట్టే ఎప్పుడో 2004 తో అధికారాన్ని కోల్పోయిన నారా చంద్రబాబు నాయుడు పేరు ఇప్పటికీ తెలంగాణ లో మారు మ్రోగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ ఖ్యాతి తెలంగాణ ఐటీ మినిష్టర్ కల్వకుంట్ల తారకరామారావుకు దక్కింది. బి.ఆర్.ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చకపోవడం వల్లనే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు.

కానీ ఆపార్టీ ముఖ్య నేత అయినా కేటిఆర్ ను మాత్రం మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఆయన పేరు, ఐటీ పురోభివృద్ధికి ఆయన చేపట్టిన పనుల గురించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అనేక రకాలుగా కేటీఆర్ పాటు పడ్డారు అన్నది కాదనలేని సత్యం, రాజకీయంగా ఆయనను వ్యతిరేకించే వారు కూడా ఈ విషయంలో ఆయనను భేష్ అనాల్సిందే.

ఎందుకంటే కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి ఇక్కడ వారి కార్య కలాపాలు ప్రారంభమయ్యే వరకు కూడా వారికి దగ్గరుండి చూసుకోవడం మనం మర్చిపోలేం. ఇక కేటీఆర్ అనేక బిజినెస్ సమ్మిట్స్ లో కూడా పాల్గొన్న వీడియోలు ఇంటర్నెట్ లో సజీవసాక్షాలుగా ఉంటాయి.

Add a heading 2023 12 04T140318.086 KTR: కేటీఆర్ పై నెటిజన్ల మనోగతం..ఇది తెలిస్తే కేటీఆర్ ఏమంటాడో.

తన మంత్రిత్వ శాఖ కోసం పెనిచేస్తూనే, పార్టీ కార్యకలాపాలను చూసుకుంటూనే, తన సొంత నియోజకవర్గ పనులను కూడా చక్కదిద్దుకున్నారు కేటీఆర్. అందుకోసమే నియోజకవర్గ ప్రజలు ఆయనకు దీవించారు.

పైగా ఫారెన్ లో ఉద్యోగం చేసి వచ్చిన అనుభవంతో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం కేటీఆర్ కి చాలా తేలికగా మారింది. అలా అని ఇక్కడ రాజకీయాలను నెరపడంలో గాను అనర్గళంగా తెలుగులో మాట్లాడటం కానీ ఆయన ఎక్కడ తడబడింది లేదు.

తెలంగాణా మాండలికంలోని కాదు చ్చ తెలుగులో కూడా తొట్రుపాటు లేకుండా మాట్లాడి మెప్పించగలడు కేటీఆర్. అందుకే బి.ఆర్.ఎస్ పార్టీ ఓడిపోయినా కేటీఆర్ ను మాత్రం మర్చిపోలేకపోతున్నారు.

ఇక్కడ మనం ఒక ముఖ్య మైన విషయాన్నీ ప్రస్తావించుకోవాలి. కేటీఆర్ అనే వ్యక్తి కేవలం తెలంగాణ ప్రజలకు తెలంగాణా బిడ్డలకు మాత్రమే నాయకుడు కాదు, సెటిలర్ల మనసు కూడా గెలుచుకోగలిగాడు.

కాబట్టే, పఠాన్ చేరు, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, వంటి ప్రాంతాల్లో కూడా బి.ఆర్.ఎస్ పార్టీ ఘన విషయాన్నీ సొంత చేసుకుంది. అయితే సెటిలర్ల మనసు దోచుకున్న కేటీఆర్ సొంత తెలంగాణ బిడ్డలా మెప్పు ఎందుకు పొందలేకపోయారా అని సందేశం రావచ్చు.

ఆయన ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, విధివిధానాల గురించి తెలియజెప్పారు. కానీ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పనుల వల్ల బిఆర్.ఎస్ జిల్లాల్లో పట్టుకోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన కుటుంబ పాలన అనే నినాదం, కాళేశ్వరం ప్రాజెక్టు…

Leave a Comment