KCR Critical Condition: కేసీఆర్ హెల్త్ పై కేటీఆర్ స్పందన..హెల్త్ బులిటెన్ లో ఆసక్తికర విషయాలు.

KTR's response on KCR's health..interesting things in the health bulletin.

KCR Critical Condition: కేసీఆర్ హెల్త్ పై కేటీఆర్ స్పందన..హెల్త్ బులిటెన్ లో ఆసక్తికర విషయాలు .

తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి సమయంలో పట్టు తప్పి బాత్ రూమ్ లో పడిపోయారు. దీంతో ఆయన తుంటి భాగంలో గాయమైంది.

వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఆయనను సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షించారు, ఆయన తుంటి భాగంలో ఎముక రెండు చోట్ల విరిగిందని స్టీల్ ప్లేట్లు అమర్చాలని చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి.

డిసెంబర్ 8వ తేదీన ఆయనకు శస్త్ర చికిత్స చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి కేసీఆర్ అల్లుడు తన్నీరు హరీష్ రావు, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రిలోనే ఉన్నారు.

ఈ క్రమంలోనే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు, తన తండ్రి ఆరోగ్యం గురించి కొన్ని వివరాలు తెలియజేశారు, అలాగే తన తండ్రి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ హెల్త్ బులిటెన్ ను బట్టి చుస్తే అర్ధరాత్రి సమయంలో కేసీఆర్ బాత్ రూమ్ లో ప్రమాదవశాత్తు కాలు జారీ పడిపోవడం వల్ల తుంటి కి గాయమైనట్టు తెలుస్తోంది.

ఇక ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే ఆయనకు అవసరం ఉన్న మేర సిటీ స్కాన్ చేశామని వెల్లడించారు. ఆయన ఎడమ తుంటిలో రెండు చోట్ల ఎముక విరిగినట్టు గుర్తించామన్నారు.

ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని, ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు.

ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు హెల్త్ బులిటెన్ ద్వారా తే;ఇయజేస్తామని చెప్పారు.

ఇది ఇలా ఉండగా కేసీఆర్ హెల్త్ గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ గురించి పర్యవేక్షిస్తూ ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యఖశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు.

దీంతో రిజ్వీ వెంటనే యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

ఆ వివరాలను ముఖ్య మంత్రికి తెలియజేశారు రిజ్వి. మరో వైపు కేసీఆర్ కి జరిగిన ఈ ప్రమాదం పట్ల ప్రధాని మోదీ కూడా విచారం వ్యక్తం చేశారు. కేవలం మోదీ మాత్రమే కాదు,

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, బి.ఆర్.ఎస్ కార్యకర్తలు కూడా ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మునుపటి మాదిరిగా అయన హుషారుగా ఉండాలని కోరుకుంటున్నారు.

Leave a Comment