Kumari Aunty Documantry on Netflix : సోషల్ మీడియాలో ఇప్పుడు సెలెబ్రిటి అంటే కుమారీ ఆంటీ. ఆమె నడుపుతున్న ఫుడ్ స్టాల్ గురించే చర్చ అంతా. ఇక ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ కుమారీ ఆంటీపై డాక్యుమెంటరీ తీయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
సోషల్ మీడియా ఎప్పుడు. ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో చెప్పలేము. రాత్రికి రాత్రికి స్టార్ అయినవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అలా రోడ్ సైడ్ మీల్స్ అమ్మే కుమారీ ఆంటీ కూడా అలానే అయిపోయారు. ఆమె ఫుడ్ రుచో లేదా ఆమె పలకరింపో , లేక ఆవిడ ఒక్క ప్లేట్ కి వసూలు చేస్తున్న ధర వల్లో తెలీదు కానీ.
ఆమె దగ్గరికి జనాలు ఒకరి తర్వాత ఒకరు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మాదాపూర్ లో ఆమె స్టాల్ దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనాలతో నిండి పోతోంది.
ఈవిడ ఫేమస్ అవడం అటుంచితే ఏకంకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్పందించే అంత ఫేమస్ అయ్యారు. తానే స్వయంగా వచ్చి కుమారీ ఆంటీ ఫుడ్ తింటాను అని రేవంత్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పాలి
డాక్యుమెంటరీ లో నిజమెంత?
ఇదిలా ఉంటే కుమారీ ఆంటీకి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ఆమెపై డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నారని, అదికూడా మూడు ఎపిసోడ్లుగా ఉంటుందని ఇది నెట్ ఫ్లిక్స్ లో వస్తుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది.
దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేమ్ అనే టైటిల్ తో ఆమెపై డాక్యుమెంట్రీ తీస్తున్నారని, ఇప్పటికే బీబీసీ కూడా ఆమెను స్పందించిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే, దీనిపై మాత్రం ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇక కొంతమందైతే.. సెటైరికల్‌గా కూడా ఈ ప్రచారం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇప్పుడు దాంట్లో నిజమెంతో వేచి చూడాల్సిందే !