Lal Salaam new movie by rajnikanth: చెప్పిన డేట్ ఫిక్స్ చేసుకోమంటున్న రజని.ఐశ్వర్య దర్శకత్వంలో రజని.లాల్ సలాం టీజర్ ఎప్పుడంటే.
సూపర్ స్టార్ రజని కాంత్ సినిమా అంటే కేవలం తమిళనాడు లో మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు సిని అభిమానులు. ఇక రజని ఫాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మోవి రిలీజైన రోజు వారికి పండుగ రోజుతో సమానం.
థియేటర్ దగ్గర తెగ సందడి చేస్తారు. తెరపై రజని కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు. అందుకు నిదర్శనమే తాజాగా రిలీజైన జైలర్ సినిమా, రజని హిట్టు కొడితే ఆ హీట్ ఎలా ఉంటుందో మరొక్కసారి చూపించారు తలైవా ఫాన్స్.
జైలర్ మానియా నడుస్తుండగానే అయన తదుపరి సినిమా గురించి అప్పుడే టాక్ వినిపిస్తోంది. ‘లాల్ సలామ్’ పేరుతొ తెరకెక్కుతున్న ఆ సినిమాను అయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా బయోపిక్ లాంటిది. ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజని కనిపిస్తారు.
అయితే ఈ సినిమా హార్డ్ డిస్క్‌లో రజనీకాంత్ సీన్స్ మిస్ అయ్యాయని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అందువల్ల సినిమా వాయిదా పడుతోంది అంటూ న్యూస్ వైరల్ అయ్యాయి. అందుకే సినిమాను ముందుగా ప్రకటించిన డేట్ కి విడుదల చేయలేరని వార్తలు వెలువడ్డాయి.
కానీ ఈ పుకార్లను చిత్ర యూనిట్ కొట్టి పారేసింది. సినిమా అనుకున్న సమయానికి తప్పక రిలీజ్ అవుతుందని ప్రకటించింది. పైగా ఈ సినిమాకి సంబంధించి, దీపావళి కానుకగా నవంబర్ 12న టీజర్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమాలో రజని తోపాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పైగా ఇది క్రికెట్, కమ్యూనలిజం గురించి చెప్పే సినిమా కావడంతో కపిల్ దేవ్ తో ఒక కీలక పాత్ర పోషింపజేస్తున్నారు. తెలుగు నటి జీవిత కూడా చాల కాలం తరువాత రజని సినిమా కోసం మరల కెమెరా ముందుకి వస్తున్నారు. దీంతో లాల్ సలాం పై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
రజని కుమార్తె ఐశ్వర్య కి ఇది మొదటి సినిమా ఏమి కాదు, ఇంతకు ముందు ఆమె ధనుష్, స్రుతి హాసన్ జంటగా 3 అనే సినిమాను తీశారు. అది మంచి ఫలితాన్ని రామబట్టడంతో ఆమె ఈ సినిమాను చక్కగా తెరకెక్కిస్తారనే నమ్మకం రజని ఫాన్స్ లో ఉంది. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను లేక ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.