Lal Salaam v/s Eagle: రవితేజకి రజినీతో పోటీ ఫిబ్రవరి 9న లాల్ సలామ్.

Ravi Tejak opposite Rajini on February 9 in Laal Salaam.

Lal Salaam: జైలర్ సినిమాతో ఈ మధ్యనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)మరోసారి తెరముందు తన మ్యాజిక్ చూపించేందుకు రెడీ అయ్యారు.

చాలా గ్యాప్ తర్వాత ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీలో రజినీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) , విక్రాంత్ (Vikranth) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev),

తెలుగు నటి జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) కూడా ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ విష్ణు రంగస్వామి (Vishnu Rangaswami) అందిస్తుండగా ఆస్కార్ విజేత మ్యూజిక్ మ్యాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ (A.R.Rehman) సంగీతాన్ని స్వరపరిచారు.

లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)బ్యానర్‌ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తోంది. అయితే మేకర్స్ లాల్ సలామ్ మూవీని ఈ సంక్రాంతి బరిలో నిలిపేందుకు ప్రయత్నించారు.

అయితే చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. లేటెస్టుగా ఈ మూవీని వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 9న రాబోతున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేసి

ట్విటర్ వేదికగా అధికారికంగా రజినీ కూతురు ఐశ్వర్య తో పాటు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు కాస్త ఆవిరయ్యాయి.

Rajinikanth as Moideen Bhai: మొయిద్దీన్ భాయ్‎గా రిజినీకాంత్

‘జైలర్'(Jailer)వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత స్టార్ రజినీకాంత్ నటిస్తోన్నమూవీ ‘లాల్ సలామ్'(Lal Salaam).అందులోనూ ఆయన ముద్దుల కూతురు ఐశ్వర్య(Aishwarya) డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

అప్పట్లో సూపర్ స్టార్ ముంబై బ్యాక్ డ్రాప్ లో బాషా (Basha)సినిమా చేశారు. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తర్వాత అదే ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ లాల్ సలామ్ మూవీని రూపొందించారు. ఇందులో మెయినుద్దీన్ భాయ్ గా రజినీకాంత్ (Rajinikanth)కనిపించనున్నారు.

మంచి స్నేహితులుగా ఉన్న హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను మొయిద్దీన్ ఎలా సాల్వ్ చేశారు?

మత విద్వేశాలను దూరం చేసి ప్ర‌జ‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను ఎలా కుదిర్చార‌న్నదే ‘లాల్ స‌లామ్‌’ మూవీ కథ. దీంతో మొయిద్దీన్ ది పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.

అంతేకాదు ఇందులో మరో అట్రాక్షన్ ఏమిటంటే రిటైర్డ్ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Ravi Teja v/s Rajini : రవితేజకి రజినీతో పోటీ

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న లాల్ సలామ్ (lAL salaam) ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

maxresdefault 20 Lal Salaam v/s Eagle: రవితేజకి రజినీతో పోటీ ఫిబ్రవరి 9న లాల్ సలామ్.

అయితే లాల్ సలామ్ రిలీజ్ అయ్యే సమయానికి తెలుగులో మాస్ మహారాజ్ మూవీ ఈగల్ (Eagle) విడుదల కానుంది.

ఈగల్ తో పాటు యాత్ర 2 (Yatra2), సందీప్ కిషన్ నటించిన ఊరిపేరు భైరవకోన (Uriperu Bhairavakona) ఫిబ్రవరి రెండో వారంలోనే విడుదల కాబోతున్నాయి.

దీంతో ఫిబ్రవరిలో సంక్రాంతి మాదిరిగానే భారీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ (Raviteja)కి సూపర్ స్టార్ తో పోటీ తప్పేలా లేదు.

Leave a Comment