Last date for Prajapalana: ప్రజాపాలనకి నేడే ఆఖరు తేదీ.

Today is the last date for public administration.

Last date for Prajapalana: తెలంగాణ(Telangana) రాష్ట్రం లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరు గ్యారంటీలు అనే హామీని ప్రజల ముందుకి తీసుకొచ్చింది.

ఆరు గ్యారంటీలు అనే నినాదాన్ని బలంగా వినిపించడం తో పరాజయాలు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలిపి అధికారాన్ని కట్టబెట్టారు.

ఇక ఆ పార్టీ అధినాయకత్వం తెలంగాణ ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డిని(Revanth Reddy) నియమించిన నాటి నుండి సీఎం రేవంత్ ఆరు గ్యారంటీల అమలు తో పాటు ఇతర హామీల అమలు విషయం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ క్రమంలోనే అధికారులను పరుగులు పెట్టిస్తూ హామీల అమలుకు సంబంధించి ప్రక్రియను సిద్ధం చేయించడం, అలాగే ప్రణాలికను, నియమనిబంధనలను రూపొందింపజేస్తున్నారు.

కోటి దాటిన దరఖాస్తులు – More than one crore applications

ప్రస్తుతం తెలంగాణాలో ఆరోగ్యారంటీల అమలుతోపాటు మిగతా సంక్షేమ హామీలను అమలు చేయడం కోసం ప్రజలనుండి దరఖాస్తు స్వీకరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ కార్యక్రమమని అటు గ్రామాలతోపాటు ఇటు పట్టణాల్లోని వార్డుల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కోటి కి పైగా దరఖాస్తులు అందాయి.

అయితే వాటిలో 93 లక్షల పైచిలుకు దరఖాస్తులు ఆరు గ్యారంటీలకు సంబంధించినవి కాగా, 15 లక్షలకు పైన ఇతర అవసరాలకు సంబంధించి దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

అయితే జనవరి 6వ తేదీతో ఈ ప్రజాపాలన కార్యక్రమానికి తెరపడనుంది. అయితే ఆఖరు రోజు కావడంతో నేడు ఈ కార్యక్రమానికి మరింత ఎక్కువమంది పోటెత్తే అవకాశం కనిపిస్తోంది.

నాలుగు నెలలు ఆగాల్సిందే – Four months to wait

అధికారులు సైతం గడిచిన పది రోజులుగా ఎవరైతే ఈ ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోలేదు వారు ఆఖరు రోజునైనా తప్పకుండ అర్జీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఇవాళ దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మరో నాలుగు నెలలపాటు వేచి ఉండక తప్పదని అంటున్నారు. ఇక ఈ దరఖాస్తు స్వీకార ఏదైతే పూర్తయిందో దానికి సంబంధించిన డేటా

ఎంట్రీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనీ, అందుకు సంబంధించి శిక్షణ కూడా సిబ్బందికి పూర్తయిందని తెలుస్తోంది.

People Who Didn’t Participated In Prajapalana :ప్రజా పాలనలో పాల్గొనలేదా ఖంగారు అక్కర్లేదు.

ఈ డేటా ఎంట్రీ ప్రక్రియను జనవరి 17వతేదీలోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారట. ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయిన వెనువెంటనే ఎంపిక చేయబడిన లబ్ధిదారుల కు సంక్షేమ పధకాలను వర్తింపజేసే విషయంలో తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలను ఇవ్వనుందని వినికిడి.

అనివార్య కారణాల వల్ల ఈ దఫా ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులు సమర్పించని వారికి సంక్షేమ పధకాలు అందవనే ఆందోళన కొందరిలో ఉంది, దానిపై కూడా రేవంత్(CM Revanth) సర్కారు వివరణ ఇచ్చింది.

ఎవరైనా ఈ దఫా దరఖాస్తు చేసుకోవడంలో విఫలమైతే మరో నాలునెలల తరువాత ఏర్పాటుచేసే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు.

Leave a Comment