Last day for traffic challans: పెండింగ్ చలాన్ల గడువు పెంపు – హెల్ప్ లైన్ ఏర్పాటు

Last day for traffic challan

Last day for traffic challans: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో వాహనదారులకు ఒక గొప్ప శుభ వార్త, 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 10 వ తేదీ లోపు వాహనదారులు పెండింగ్ చలాన్లను(Pending Chalans) పే చేసుకోవాలని, ఈ గడువు లోగా బకాయి ఉన్న చలాన్లు కట్టుకునే వారికి భారీ స్థాయిలో డిస్కౌంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కారు(CM Revanth Reddy) తెలిపింది.

అయితే లక్షల సంఖ్యలో ఉన్న పెండింగ్ చలాన్ల ను ఇప్పటికే అనేక మంది చెల్లించారు. దాని వల్ల ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం కూడా సమకూరింది.

కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ గడువును మరింత పొడిగించింది. పెండింగ్ చలాన్లు కట్టవలసిన వారు జనవరి 31 వ తేదీ లోగా కట్టుకోవచ్చి వెల్లడించింది. ఈ వార్త విన్న చాల మంది వాహనదారులు మిక్కిలి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు : Last day for traffic challans

ఈ చలాన్ల డిస్కౌంట్ ఎలా ఉంది అంటే ఆర్టీసీ బస్సులు9 (RTC Busses), తోపుడు బండ్ల పై ఉన్న చలాన్ల కు 90శాతం డిస్కౌంట్ ఇచ్చారు.

ఇక ద్విచక్ర వాహనాలకు(Two Whelers) 80 పర్సెంట్ తగ్గింపు ఇవ్వగా, నాలుగు చక్రాల వాహనాలు, ఆటోలకు 60 శాతం, లారీలు(Lorrys), ట్రక్కులు, భారీ వాహనాలకు(Heavy Vehicles) 50 శాతం తగ్గింపును ప్రకటించారు(Last day for traffic challan). ఇలా తగ్గింపు అయితే ఇచ్చారు కానీ చలాన్లను కట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అధికార యంత్రాంగం దృష్టికి కూడా వచ్చింది. అందుకే పెండింగ్ చలాన్ల పై రుసుము ఆన్లైన్ విధానంలో చెల్లించే వారి కోసం హెల్ప్ లైన్ ను మొదలు పెట్టారు. అందుకోసం ఒక వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు.

echallanhelpdesk.hyd@ gmail.com అనే వెబ్ సైట్ ను సందర్శించవచ్చు(Last day for traffic challan). లేదా 040-27852721, 040-27852772 నెంబర్ల పై కాల్ కూడా చేయవచ్చు. కేవలం కాలింగ్ నేబర్లు మాత్రమే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించే సౌలభ్యం కల్పించారు అధికారులు.

Whatsapp Traffic helpline:

ట్రాఫిక్ హెల్ప్ లైన్ కోసం 8712661690 నెంబర్ ను అందుబాటులో ఉంచారు.

కాబట్టి పొడిగించిన గడువును ఉపాయించుకుని పెండింగ్ లో ఉన్న ఈ చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకోవచ్చు.

Leave a Comment