తిరుపతి APSRTC లో బయట పడిన అత్యాధునిక మోసం.

website 6tvnews template 94 తిరుపతి APSRTC లో బయట పడిన అత్యాధునిక మోసం.

Latest fraud exposed in Tirupati APSRTC : ప్రముఖ్య పుణ్యక్షేత్రం అయిన తిరుపతి లో ఒక అత్యాధునిక మోసం బయటకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే తిరుపతి APSRTC కు చెందిన ఒక అద్దె బస్సుకు చెందిన డ్రైవర్ కంప్యూటరైజ్ద్ టిక్కెట్లను నకిలీ టిక్కెట్లను తయారు చేసి అవి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. టిక్కెట్స్ జారి లో వచ్చిన మార్పులు గుర్తించిన అధికారులు రంగం లో దిగి ఎంక్వయిరీ చేస్తున్నారు.

రంగం లో దిగిన అధికారులు పలు వివరాలు సేకరించారు. రోజుకు ఇతను తిరుమల – తిరుపతి మధ్య 50 ట్రిప్పులు, తిరుమల – రేణిగుంట ఎయిర్ పోర్ట్ మద్య 10 ట్రిప్పులు,తిరుపతి – మదనపల్లె మధ్య 6 ట్రిప్పులు, తిరుపతి – నెల్లూరు ల మధ్య 8 ట్రిప్పులు, తిరుపతి – కడప ల మధ్య 8 ట్రిప్పులు, తిరుపతి – శ్రీ కాళహస్తి ల మధ్య 3 ట్రిప్పులు ఇలా మొత్తం 85 ఎలక్ట్రికల్ బస్సు లు నడుస్తున్నాయి. వీటి మీద వచ్చిన మొత్తం ఆదాయాన్ని వారు తీసుకుని ఆ తర్వాత అద్దె బస్సు నడిపే సంస్డకి కిలోమీటర్ కొంత మొత్తం ను చెల్లిస్తారు.

apsrtc bus enquiry tirupati ho tirupati rtc enquiry f2imij2 తిరుపతి APSRTC లో బయట పడిన అత్యాధునిక మోసం.

అద్దె బస్సు లలో డ్రైవర్ లకు ఈ టిమ్ మెషీన్ లు ఇవ్వడం వల్లే మోసం జరిగిందని గుర్తించారు. డ్రైవర్ ల కొరత కండక్టర్ ల కొరత వల్ల అద్దె బస్సు లు నడుపుతున్నామని అందువల్ల టిమ్ మెషీన్ లను ఆ బస్సు నడిపే డ్రైవర్ లకి ఇవ్వడం జరిగింది అని అధికారులు చెప్పారు. ఈ అద్దె బస్సు లు నడిపే వారు ఎక్కువ ట్రిప్పులు వెయ్యాలనే ఉద్దేశ్యం తో బస్సు లను అతివేగంగా నడుపుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. APSRTC సస్డ వచ్చే ఆదాయం మీదనే దృష్టి పెడుతోందని ప్రయాణికుల ప్రాణాలను గాలికి వదిలేసారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

మోసం ఇలా చేస్తారు:

APSRTC సంస్ద టిక్కెట్ల కోసం టిక్కెట్ మెషీన్ అయిన టిమ్ లను డ్రైవర్ కి ఇస్తారు. ఇక్కడే డ్రైవర్ మోసానికి తెర తీస్తాడు. హైటెక్ టెక్నాలజీ ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ టిక్కెట్ సృష్టించి అవే ప్రయాణికులకు ఇస్తాడు. ఈ టిక్కెట్ల మీద వచ్చిన సొమ్ము అంతా తన ఖాతా లో వేసుకుంటాడు. చూడడానికి అచ్చం ఒరిజినల్ టిక్కెట్ ని పోలి ఉండే ఈ టిక్కెట్ లను ఎవరు గుర్తించలేరు. ఇదే ఆ డ్రైవర్ కి కలిసి వచ్చింది. మోసం గుర్హించిన అధికారులు దాడులు చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన డ్రైవర్ సురేష్ బాబు ని అరెస్ట్ అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Comment