Laughing gas is banned in that country : ఆ దేశంలో లాఫింగ్ గ్యాస్ నిషేధం.లాఫింగ్ గ్యాస్ తో ఇన్ని తంటాలు వస్తాయా.
సై సినిమాలో హీరో నితిన్ ను కొట్టేందుకు చాలా కోపంగా వస్తున్న జానీలియా పై ఒక రకమైన రసాయనాన్ని ప్రయోగిస్తాడు. ముందుగా ఆమె వస్తున్నా మార్గంలో గాలిలో ఆ రసాయనాన్ని స్ప్రే చేస్తాడు నితిన్.
తీరా కొట్టడానికి వచ్చిన జెనీలియా విపరీతంగా నవ్వేస్తుంది. దానినే లాఫింగ్ గ్యాస్ (నైట్రస్ ఆక్సయిడ్) అంటారు. ఈ లాఫింగ్ గాస్ ను నిషేధించారు. అయితే అది మన దేశంలో కాదు, బిటన్ లో.
ఈ మేరకు రిషి సునాక్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట బ్రిటన్ లో నిషేధిత లాఫింగ్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసినా, సరఫరా చేసినా, అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవు హెచ్చరికలు కారి చేసింది.
అయితే రిషి సునక్ సర్కారు ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య మరణం ఏమిటంటే దీని వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడ్డాయట.
అయితే ఈ విషయంలో బ్రిటన్ సర్కారు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. హెల్త్ కేరే విభాగాలు, ఇతర ఫ్యాక్టరీల్లో చట్టానికి లోబడి ఈ లాఫింగ్ గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చని లేదా వినియోగించుకోవచ్చని చెప్పింది.
ఇక చట్టప్రకారం ఏర్పాటు చేసిన నిబంధనలు అతిక్రమించినవారికి 2 ఏళ్ళ నుండి 14 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ లాఫింగ్ గ్యాస్ ను బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మోతాదులో విడుదల చేయడం ద్వారా అక్కడి ప్రజలు ద్వారా సంఘ వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడే అవకాశం ఉందట.
అంతే కాక దాని తీవ్రత ఎక్కువైతే అనారోగ్యానికి కూడా గురవుతారని అంటున్నారు. కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే 16 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న యువత డ్రగ్స్ మాదిరిగా దీనిని తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ లాఫింగ్ గ్యాస్ ను పీల్చడం వల్ల కృత్రిమమైన సంతోషాన్ని, నవ్వును పొందుతున్నారు, కానీ అనంతర కాలంలో ఆరోగ్యం పాలవుతున్నారు. దీని వల్ల రక్త హీనత బారిన కూడా పడతారట.
ఈ ఏడాది మార్చిలోనే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఈ గ్యాస్ నిషేధానికి ప్రతిపాదనలు చేయగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది.