Lavanya Tripathi Konidela Photo shoot : పెళ్ళైనా తగ్గేదేలే అందాల రాక్షసి చీరకట్టు అదుర్స్..

6tv projects 14 Lavanya Tripathi Konidela Photo shoot : పెళ్ళైనా తగ్గేదేలే అందాల రాక్షసి చీరకట్టు అదుర్స్..

Lavanya Tripathi Konidela Photo shoot : పెళ్ళైనా తగ్గేదేలే అందాల రాక్షసి చీరకట్టు అదుర్స్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యూపీ బ్యూటీ టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి తమ ఐదేళ్ల ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ మధ్యనే మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మెగా కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఇటలీలో ఎంతో గ్రాండ్‎గా జరిగింది. హైదరాబాద్‏లో రిసెప్షన్‎ను ఘనంగా నిర్వహించారు. పెళ్లి తర్వాత మొదటి దీపావళిని కొణిదెల కోడలు అంగరంగవైభంగా జరుపుకుంది.

ఇప్పుడిప్పుడే పెళ్లి బిజీ నుంచి బయటపడుతున్న లావణ్య త్రిపాఠి రీసెంట్ గా పెళ్లి ఫోటోలను షేర్ చేసి తన ఫ్యాన్స్‎ను ఖుషీ చేసింది. మరోవైపు వరుణ్ షూటింగ్లతో బిజీ అయిపోయాడు. ఇటు లావణ్య కూడా తగ్గేదేలేదంటూ అద్భుతమైన ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత అద్భుతమైన ఫోటో షూట్లతో ఫ్యాన్స్‎కు పిచ్చెక్కిస్తోంది. మోడ్రన్ దుస్తుల నుంచి ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ వరకు అన్నింటిని ధరిస్తూ బ్యూటీఫుల్ లుక్స్‎తో నెట్టింట అదరగొడుతోంది. తన అందాల ప్రదర్శనతో అభిమానులను, నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో ఫ్యాన్స్ హృదయాలను కట్టిపడేసింది.

పెళ్లైన తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న లావణ్య మళ్లీ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‎ను ఫ్యాషన్‎తో పలకరిస్తోంది. ఇప్పటికే కొణిదెలవారి కోడలు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫొటోలు తన ఫాలోవర్స్‎ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వరుస పెట్టి గ్యాప్ ఇవ్వకుండా ఫొటోలతో తన ఇన్‎స్టాగ్రామ్‎ను నింపేస్తోంది. గ్లామర్‎తో అభిమానులను కట్టిపడేస్తోంది.

తాజాగా ఈ సొట్టబుగ్గర సుందరి చీరకట్టులో మెస్మరైజ్ . సంప్రదాయ చీర కట్టులో లావణ్య అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకట్టుకుంది. ఎరుపు రంగు చీర కట్టుకుని బ్యూటీఫుల్ స్టిల్స్‎తో ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటికే లావణ్య తన పెళ్లిలో అందమైన దుస్తులు ధరించి అదరగొట్టింది. అదే ట్రెండ్ ను ఇప్పటికీ కొనసాగిస్తోంది ఈ చిన్నది. లేటెస్టుగా లావణ్య షేర్ చేసిన ఈ చిత్రాలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైక్స్, కామెంట్లతో ఇన్ బాక్స్ నిండిపోతోంది. మెగా కోడలిని ఫాలోవర్స్ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు.

లావణ్య త్రిపాఠి ఈ అందమైన చీరను ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యానీ కలెక్షన్స్ నుంచి సేకరించింది. వేగ శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి జువెలరీ కలెక్షన్‎ను ధరించి లావణ్య ఎంతో ఉత్కంఠభరితంగా కనిపించింది. ప్రముఖ స్టైలిస్ట్ అశ్విన్ లావణ్య అందాలకు మెరుగులు దిద్దాడు.

అందాల రాక్షసి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది లావణ్య త్రిపాఠి. ఈ మూవీకిగాను లావణ్య విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఈ చిత్రం తరువాత రాధా, మిస్టర్, సొగ్గాడే చిన్నినాయన, లచ్చిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తూ శుభమస్తు, భలే భలే మగాడివోయి వంటి మూవీస్ చేసింది. లావణ్య చివరిగా ‘హ్యాపీ బర్త్ డే’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫరవాలేదనిపించింది. అయితే పెళ్లైన తర్వాత లావణ్య సినిమాలకు విరామం ఇస్తుందనుకున్నారు అందరూ. కానీ అలా జరగలేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ‘తనాల్’ అనే మూవీలో నటిస్తోంది.

Leave a Comment