Leaked Photos from Pushpa-2 Movie – Andolan Lo Film Unit : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న ‘పుష్ప-2’ షూటింగ్ కు సంబందించిన ఫొటోలు బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీని వల్ల చిత్ర యూనిట్ ఆందోళన లో పడింది. ముందు ముందు ఇంకా ఇలాంటి లీకుకు ఎన్ని వస్తాయో అని టెన్షన్ పడుతున్నారు. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబందించి ఒక పిక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా ఉండడం చూడవచ్చు.
ఇక 2021లో పుష్ప మొదటి పార్ట్ లో ‘పుష్ప – ద రైజ్’ పేరుతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో భారీ వసూళ్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2’ ఆగస్టు 15న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసామని మైత్రి మూవీ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేసారు.
ప్రస్తుతం దీనికి సంబందించిన మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుకుమార్. ఈ మూవీలో ఇతర కీలక పాత్రల్లో ఫహాద్ ఫాజిల్, జగదీష్ ప్రతాప్ బండారీ, సునీల్, అనసూయ, రాజ్ తిరన్‌దాసు నటించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. ఇటీవల యాగంటి ఆలయంలో జరిగిన ఈ మూవీ షూటింగ్ విశేషాలను తన ఇన్‌స్టా స్టోరీలో రష్మిక అభిమానులతో పంచుకుంది. షూటింగ్ సమయం లో తీసిన ఫొటోను షేర్ చేసింది. ” ఈరోజు ఈ దేవాలయంలో మూవీ షూటింగ్ జరిగింది . యాగంటి అని పిలవబడే ఈ ఆలయ ప్రదేశం చాలా అద్భుతం, ఇక్కడి ప్రజలు, వారి ప్రేమ మాటల్లో చెప్పలేను, ఈ రోజు అద్భుతంగా గడిచింది” అని చెప్పుకొచ్చింది.
అలాగే కొన్ని రోజుల ముందు ‘పింక్‌విల్లా’ పేరు తో ఇంటర్వ్యూలో ‘పుష్ప-2’లోని తన పాత్ర గురించి కొన్ని విషయాలు చెప్పింది. ఈ మూవీలో పుష్ప భార్యగా నా పాత్ర బాధ్యతతో కూడుకుని ఉంటుందని, పార్ట్ 1 కంటే రెండో పార్టు లో డ్రామాతో పాటు పాత్రల మధ్య వైర్యం కూడా అదే స్థాయిలో ఉంటుందని, ఇంకా చెప్పాలంటే పార్ట్-2 లో అభిమానులు కోరుకునే అన్ని మసాలాలు ఎక్కువగా ఉంటాయనిచెప్పింది.