Let’s modernize the laws – Modi : సుప్రీంకోర్టు ‘డైమండ్ జూబ్లీ ఇయర్’(Supreme Court’s Diamond Jubilee Year) వేడుకల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice DY Chandrachud), దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న చీఫ్ జస్టిస్, అలాగే ప్రధాని మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందుగా మాట్లాడిన సీజే న్యాయ వ్యవస్థలో ఎదురయ్యే సవాళ్ళను గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాయిదాల కల్చర్ ను పక్కన పెట్టాల్సిన ఆవశ్యత ఎంతగానో ఉందన్నారు.
అంతేకాక దీర్ఘకాలికా సెలవుల విషయాన్ని కూడా పరిష్కరించుకునే మార్గాన్ని అన్వేషించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చుస్తే న్యాయ వ్యవస్థలో మహిళా ప్రాధాన్యత బాగా కనిపిస్తోందన్నారు. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమన్నారు.
ఒకప్పుడు పురుషులు మాత్రమే ఎక్కువగా ఈ న్యాయ వృత్తిని ఎంచుకునే వారని, కానీ రాను రాను ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.
సీజేఐ నోట ఏపీ మాట : CJI Speaks About Ap
దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని న్యాయవాదులు న్యాయమూర్తుల్లో మహిళల సంఖ్య 36.3 శాతానికి ఉందని గుర్తుచేశారు. అనేక రాష్ట్రాల్లో జూనియర్ సివిల్ జడ్జిల నియామకాల్లో ఎంపికైన న్యాయమూర్తుల్లో మహిళల సంఖ్య 50 శాతానికి ఉందని చెప్పారు.
ఇది నిజంగా హర్షించ దగ్గ విషయమన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh), కర్ణాటక(karnataka), మహారాష్ట్ర(Maharashtra), ఉత్తర్ ప్రదేశ్(Uttara pradesh) రాష్ట్రాల విషయం సిజెఐ నోట ప్రస్తావించబడింది.
మన దేశ చట్టాలను ఆధునీకరిస్తున్నాం – మోదీ : We are modernizing our laws – Modi
ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మన దేశ చట్టాలను ఆధునీకరించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు.
ఇలా మోడ్రనైజ్ చేసిన చట్టాలు మన దేశాన్ని భవిష్యత్తులో మరింత పటిష్టంగా చేస్తాయని అన్నారు. మన దేశ లీగల్, పోలీసింగ్, ఇంకా దర్యాప్తు సంస్థలు మూడూ కూడా కొత్త నేర న్యాయ చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త శకాన్ని చూస్తున్నాయని పేర్కొన్నారు.
We are modernizing our laws – Modi జన్ వికాస్ బిల్లు అనేది రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థపై పడే భారాన్ని తగ్గిస్తుందని అన్నారు.
ప్రజల విశ్వాసానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తోందని చెప్పారు.