LIC కొత్త పాలసీ….ఈ బెనిఫిట్స్ మీరు చూశారా.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా అందరికి తెలిసిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ.
కష్టపడి దాచుకున్న డబ్బులకి మంచి భద్రత, ఆదాయం ఇవ్వడానికి, ఇంటికి పెద్దదిక్కైన వ్యక్తికి ఆకస్మికంగా ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడకుండా, ఆ కుటుంబానికి ఆర్థిక ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రతి కుటుంబానికి బీమా అవసరం.
అందుకోసమే LIC ఇప్పటికే చాలా పాలసీలు తీసుకువచ్చింది. అయినా అధిక రిటర్న్ ల కోసం మదుపర్లు వేరే వేరే పెట్టుబడి ప్రదేశాల్లో సొమ్ముని మదుపు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే , LIC నవంబర్ 29వ తేదీన ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అది ఎటువంటి పాలసీ దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం.
ఐదు సంవత్సరాలు కడితే జీవితాంతం ఆదాయం, 10 శాతం గ్యారంటీ ఆదాయం పొందవచ్చు. ఈ పాలసీ మరేదో కాదు,LIC జీవన్ ఉత్సవ్. ప్లాన్ నెంబర్ 871, నవంబర్ 29న ఈ పాలసీని ప్రవేశపెట్టింది.
LIC జీవన్ ఉత్సవ్ వివరాలు:
- ఇది పూర్తిగా నాన్ లింక్డ్ పాలసీ.
- నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ.
- ఇది పూర్తిగా ఇండివిడ్యువల్.
- LIC జీవితాంతం భీమా అందించే పాలసీ.
- ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే, ఐదేళ్లు చెల్లించాక జీవితాంతం ఆదాయం పొందవచ్చు.
- హామీ డబ్బు మొత్తంలో 10 శాతం ఆదాయంగా చెల్లిస్తారు.
LIC జీవన్ ఉత్సవ్ ప్రధాన అంశాలు:
ప్రీమియం టర్మ్, వెయిటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత, ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది.
ఒకవేళ సాధారణ ఆదాయం వద్దని మదుపు దారుడు భావిస్తే ఫ్లెక్సీ విధానం ద్వారా చక్రవడ్డీ పొందే అవకాశం కూడా ఉంది.
పాలసీ మొదలైన సంవత్సరం నుంచే బతికి ఉన్నంతవరకు బీమా అందుతుంది.
ప్రీమియం కట్టే కాలానికి 1000 రూపాయలకి 40 రూపాయల చొప్పున గ్యారంటీ అడిషన్స్ ఉంటాయి.
3 నెలల వయసున్న పిల్లల నుంచి 65 సంవత్సరాలు వచ్చే వృద్ధుల వరకు ఈ పాలసీలో చేరే అవకాశం ఉంది.
LIC జీవన్ పాలసీ:
LIC జీవం పాలసీని పురుషులు, స్త్రీలు ఎవరైనా తీసుకోవచ్చు.
90 రోజుల వయసు నుంచి ఎవరైనా అర్హులే, వయో పరిమితి 65 ఏళ్ళు.
పాలసీ తీసుకున్నాక 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తం కనిష్టంగా భీమా 5 లక్షలు.
కాలవ్యవధిని బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది.
ప్రీమియం పూర్తిగా చెల్లించాల్సిన సమయం ముగిసిన తర్వాత, పాలసీతీసుకున్న వ్యక్తి ఈ ప్లాన్ కింద జీవితాంతం ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ ప్లాన్ లో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి.
రెగ్యులర్ ఆదాయం:
దీనిలో బేసిక్ మొత్తం నుంచి ప్రతి యేటా 10 శాతం ఆదాయం వస్తుంది.
ఫ్లెక్సీ ఆదాయం:
బీమా మొత్తంలో 10 శాతం ప్రతిఫలం అందుతుంది.
మొత్తం LIC దగ్గరే ఉంచినట్లయితే, 5.5 శాతం చక్రవడ్డీ జమ అవుతుంది.
అందు వల్ల ఒకేసారి పెద్ద మొత్తాన్ని జమ చేసుకునే అవకాశం దొరుకుతుంది.
ఒకవేళ మనం కావాలి అనుకుంటే 75 శాతం డబ్బుని తీసుకోవచ్చు, అప్పుడు మిగిలిన డబ్బు పైన చక్రవడ్డీ వస్తుంది.
పాలసీదారుడు గనక మరణిస్తే జమ ఐన మొత్తం డబ్బు డెత్ బెనిఫిట్స్ ని నామినిదారుడికి చెల్లిస్తారు.
దానితో పాటుగా గ్యారంటీ ఆడిషన్స్ కూడా చెల్లిస్తుంది.
డెత్ బీమా మొత్తం లేదా వార్షిక ప్రీమియాన్ని 7 రేట్లు పెంచగా వచ్చిన సొమ్ము, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ నోట్లన్నీ నామినికి చెల్లిస్తుంది ఈ LIC జీవన్ ఉత్సవ్.
LIC జీవన్ పాలసీ రైడర్లు:
- LIC ACCIDENTAL DEATH.
- డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్.
- LIC న్యూటెర్మ్ అస్స్యూరెన్స్ రైడర్.
- LIC న్యూ క్రిటికల్ ఇల్ నెస్ బెనిఫిట్ రైడర్.
- LIC ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్.
ఈ రైడర్లు మన ఆసక్తిని, అర్హతని బట్టి అదనంగా జోడించుకోవచ్చు.