ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీకి పెద్ద రిలీఫ్ లభించిందని చెప్పాలి. ఆపార్టీకి ఉన్న గాజు గ్లాస్ గుర్తు మారిపోతుందని, మరో కొత్త గుర్తు వస్తుందని నిన్న మొన్నటి వరకు అనేక వార్తలు వినిపించాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ హాయ్ కోర్ట్ జనసేనకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. జనసేన ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసే ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. పైగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది అంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
దీంతో ఈ ఎన్నికలలో కూడా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుతోనే బరిలోకి దిగడానికి లైన్ క్లియర్ అయింది. గతంలో గాజు గ్లాస్ సింబల్ తమదంటే తమదని జనసేన, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ పడటం వల్ల ఆ గుర్తును ఈసి ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో పెట్టింది. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు తో దానిని జనసేనకు కేటాయించడం ఖారయిపోయినట్టే అంటున్నారు జనసైనికులు. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నాయి. ఇప్పటికే ప్రచారంతో ఈ మూడు పార్టీలు హోరెత్తిస్తున్నాయి. అధికార వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. పైగా ఈ కూటమికె విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా చెప్పడం విశేషం.