Buy Dairy Milk Chocolate, Insects free for Bonus – Hyderabad : ఈ రోజుల్లో చాకొలేట్ లను ఇష్టపడనీ వారు ఎవరు ఉంటారు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఎదో ఒక రూపం లో తీసుకోవడం కామన్. అంతే కాదు చాకొలేట్ వలన మనకి కొన్ని ఉపయోగాలు కుడా ఉన్నాయని చెప్తునారు నిపుణులు.
మెదడు ఉత్తేజం గ పనిచేస్తునదని, గుండె కు కూడా మంచిదని అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలని ఎక్కువగా తీసుకుంటే చాల ప్రమాదమని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. అయితే చాకొలేట్ లు తినేముందు అవి ఎప్పుడు తయారయ్యాయని ఎంత వరకు గడువు ఉందని తప్పకుండ చూసి తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు.
ఎందుకంటే గడువు ముగిసిన చాకొలేట్ లో కొన్ని రసాయనాలు తయారవుతాయని అవి చిన్న పిల్లల మెదడు మీద నాడి వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అంతే కాదు అందులో చిన్న చిన్న పురుగులు కంటికి కనిపించ నతంగా ఉంటాయని అవి చిన్న పిల్లల ప్రేగుల్లో కి వెళ్ళి అక్కడ నుండి మెదడుకు చేర తాయని, దీనివల్ల చిన్న పిల్లల్లో మెదడు కు సంబందించిన అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని డాక్టర్స్ చెప్తున్నారు
చాకొలేట్ లో పురుగులు :
ఇటీవల ఒక వినియోగదారుడు తన పిల్లల కోసం పెద్ద డైరీ చాకొలేట్ ని కొనుగోలు చేసాడు. అయితే ప్యాకెట్ కవర్ తియ్యగానే అందులో అందులో చిన్న చిన్న పురుగులు ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు.అయితే ఆ పురుగులు బ్రతికే ఉన్నాయని కూడా తెలిసేలా ఒక వీడియో తీసి ట్విట్టర్ X లో పోస్ట్ చేసాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో అమీర్ పేట లో జరిగినట్లు గా తెలుస్తోంది.
అయితే ఆ వినియోగదారుడు ఆ చాకొలేట్ ను అమీర్ పెట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న రాత్నదీప్ సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. దీనికి సంబందించిన బిల్ ని టాగ్ చేస్తూ డైరీ మిల్క్ చాకొలేట్ కంపెనీ ఫిర్యాదు కూడా చేసాడు. అంతేకాదు గడువు ముగిసిన ఐటమ్స్ ని వినియోగ దారుడు కి ఎన్నో రకాల సమస్యలు వస్తాయని దీనిపై చర్య తీసుకోవాల్సింది గా G. H. M. C కూడా ఫిర్యాదు చేసాడు.
దీనిపై డైరీ మిల్క్ చాకొలేట్ యాజమాన్యం స్పందించి మీకు కలిగిన అసౌకర్యం కలిగినందుకు క్షమించమని మీ ఫిర్యాదు పై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపాయి