Lokesh Kanagaraj says that he will not make such films: ఇకమీదట అలంటి సినిమాలు తీయను అంటున్న లోకేష్ కానగరాజ్..అయితే రోలెక్స్ మాటేంటి అంటున్న ఫాన్స్..
తమిళ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తనదైన సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. 2016 లో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అనతికాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
తక్కువ సినిమాలే చేసినప్పటికీ అతడి పేరు చెబితే ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేలా చేసుకున్నాడు. అందుకు కారణం విక్రమ్ సినిమా, కమల్ హాసన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో మాస్ పల్స్ ను గట్టిగా పట్టుకున్నాడు.
ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిని గమనించిన లోకేష్ దానికి కావలసిన అన్ని మసాలాలు తన సినిమాలో గట్టిగా దట్టించి కధలను వండుతున్నాడు.
అందుకే లోకేష్ అడిగిన వెంటనే పెద్ద పెద్ద హీరోలు సైతం డేట్స్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్ గా విజయ్ హీరోగా వచ్చిన లియో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. మొదట్లో కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా తరువాత బాగానే పుంజుకుంది.
ఇక లోకేష్ సినిమాల్లో మరో విశేషం కూడా ఉంటుంది. ఒక హీరో సినిమాలో క్లైమక్స్ కి రాగానే మరో హీరోను అందులో చూపిస్తాడు. దానినే సినిమాటిక్ యూనివర్స్ అనే పేరు పెట్టుకున్నారు.
ఇక లోకేష్ కెరియర్ బిగినింగ్ లోనే ఒక మాట చెప్పాడు. తాను కేవలం 10 సినిమాలు మాత్రమే చేస్తానని అంతకు మించి చేయనని అన్నాడు. ఖైదీ, విక్రమ్, లియో తరువాత అతను చేయబోయే సినిమా రజని కాంత్ తో ఉండనుంది.
ఈ సినిమాలో తాను సినిమాటిక్ యూనివర్స్ ను ఎలా చూపిస్తాడా అని అంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నా టైం లో లోకేష్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను ఇక మీదట అలాంటి సినిమాలు చేయనని అనౌన్స్ చేశాడు. ఆ అవకాశాలను తన అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇస్తానాని చెప్పాడు.
ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలను డైరెక్ట్ చేసే భాద్యత వారి షోల్డర్స్ మీదే వేస్తున్నాడట. అయితే హీరో సూర్యను విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా పరిచయం చేశాడు, మరి లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ విధానాన్ని పక్కనపెడితే రోలెక్స్ లాంటి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ను తెరపై చూడలేమా అని డీలా పడుతున్నారు సూర్య ఫాన్స్. మరి రజని తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారు లోకేష్, ఆ సినిమా ఎలా ఉండబోతోందా అని వెయిట్ చేస్తున్నారు.