కేవలం శివరాత్రి రోజున మాత్రమే ప్రత్యక్షమయ్యే శివయ్య

WhatsApp Image 2024 03 12 at 12.40.55 PM కేవలం శివరాత్రి రోజున మాత్రమే ప్రత్యక్షమయ్యే శివయ్య

భారత దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఇంకా కొన్ని ప్రాంతాలలో జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ప్రతీ హిందువు మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అంతే కాదు రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి అర్ధరాత్రి ఉద్భవించే ఆ పరమేశ్వరుని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి తరిస్తారు.

మన దేశవ్యాప్తంగా ఉన్న పలు జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత, ప్రాధాన్యత ఉంటుంది. మన దేశం లో హిందువులందరూ ప్రతి ఆలయాన్ని దర్శించాలని భక్తులు ఎప్పుడు తపిస్తుంటారు. వీటిలో ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి రాజస్థాన్‌లోని సంగమేశ్వర్‌ మహదేవ్‌ ఆలయం కూడా ఒకటి.

రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు మహా శివరాత్రి అనేది ఎంతో ప్రత్యేకమైన పండుగ. అనే చెప్పాలి. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక అద్భుత శివాలయం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం ఆ నదీ సంగమంలో మునిగి ఉండిపోతుంది.

ఇక్కడ కొలువైన శివుడిని ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది, మిగిలిన 8 నెలలు ఈ ఆలయం నాలుగు అడుగుల లోతులో నీటిలో మునిగి ఉంటుంది. కేవలం మహాశివరాత్రి పర్వదినాన్న మాత్రమే ఆ పరమేశ్వరుడి దర్శనం అనంతరం నాలుగు నెలల పాటు ఆయన దర్శనాలు చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తు ఉంటారు.

Leave a Comment