Lorry Accident : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో లారీ ప్రమాదం. ఫ్లై ఓవర్‌పై ఉన్న పిల్లర్‌ను లారీ ఢీకొట్టింది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అక్కడవున్న వారిని ఉలిక్కి పడేలా చేసింది. హై వే పై హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఓ లారీ డ్రైవర్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఒక్కసారి గా అందరిని ఆందోళనకి గురిచేసింది.
నరసన్నపేట సమీపంలోని జమ్మూ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ పై వెళ్తున్న కంటైనర్ ఒక్కసారిగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ స్తంభాన్ని ఢీ కొట్టడం వల్ల కొంత మేర వేగం నియంత్రణ లోకి వచ్చింది, ఫ్లై ఓవర్ మీది ఉండిపోయి కిందకి పడిపోకుండా ఆగింది. ప్రమాదంలో లారీ ముందు భాగం దిబ్బ తింది. ఇక లారీ పై నుండి కిందపడిపోకుండా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పైగా ఈ ప్రమాదం సంభవించిన ప్రాంతం ఎల్లప్పుడూ రద్దీ గా ఉండే ప్రాంతం. లారీ ఫ్లై ఓవర్ సైడ్ వాల్ ను ఢీ కొట్టకుండా ఎదురుగా వెళుతున్న వాహనాలను ఢీ కొట్టినా పెద్ద ప్రమాదమే జరిగి ప్రాణనష్టం సంభవించి ఉండేది.
అయితే ఈ లారీ ఫ్లై ఓవర్ వాల్ ను ఢీకొని ముందుకు వచ్చేయడం కారణంగా ఫ్లై ఓవర్ సైడ్ వాల్ పలకలు ఊడిపోయాయి. లారీ కూడా స్తంభాన్ని ఢీకొట్టి అలా మధ్యలోనే ఉండిపోవడంతో లారీ కిందపడకుండా పైనే ఉండిపోయింది.
లారీ ఫ్లై ఓవర్ సైడ్ వాల్ ను ధీ కొట్టిన సమయంలో కింద ఎవ్వరు లేకపోవడం అదృష్టంగా భావిస్తున్నారు. కింద గనుక ఎవరైనా ఉండి ఉంటె ఖచ్చింతంగా ప్రాణాపాయం ఏర్పడేది అని ప్రత్యక్షంగా చుసిన వారు చెబుతున్నారు.