NaaSaami Ranga new Song Release : నా సామిరంగా నుండి లిరికల్ సాంగ్..కెమిస్ట్రీ అదుర్స్.

Lyrical song from Na Samiranga..Chemistry Adurs.

NaaSaami Ranga new Song Release: నా సామిరంగా నుండి లిరికల్ సాంగ్..కెమిస్ట్రీ అదుర్స్.

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా రూపొందుతున్న తాజా సినిమా నా సామి రంగ. ఈ సినిమా నుండి ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తోందే అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. హీరో నాగార్జున కి తగ్గట్టే ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉంది.

కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. వీరిద్దరూ ఆస్కార్ జంట అన్నది మర్చిపోకూడదు. మరో సారి నాగ్ సినిమాలోని ఈ పాటతో వీరి కాంబినేషన్ సెట్ అయింది. ఇక ఈపాట అచ్చతెలుగు పాట, ముచ్చటైన పల్లెటూరి పాట.

అటువంటి ఈ పాటను రామ్ మిరియాల ఆలపించి తన గాత్రంతో మరింత సొబగులు అద్దారు. యువతుల గుండెలు కొల్లగొట్టే గ్రీకువీరుడు నాగార్జున.

మరి అటువంటి హీరో నుండి ఒక సినిమా వస్తోంది అంటే ఆ సినిమాపై హైప్ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ను నాగార్జున ఒక కొరియోగ్రాఫర్ చేతిలో పెట్టారు.

అయితే నాగార్జున కి ఇది కొత్తేమి కాదు, ఒకప్పుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో మాస్ అనే సినిమా చేసి మాసివ్ హిట్ అందుకున్నాడు.

రాఘవ లారెన్స్ కి డైరెక్టర్ గా అది డెబ్యూ ఫిలిం. ఇప్పడు కూడా నాగ్ ఒక నృత్య దర్శకుడిని చిత్ర దర్శకుడిగా మార్చబోతున్నారు. ఇక ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం మీద నిర్మిస్తున్నారు.

Leave a Comment