Maa Oori Polimera 2 – పొలిమేర 2 సినిమా ఎలా ఉందంటే…ఇది భయపెట్టే సినిమానేనా ?

Add a heading 5 Maa Oori Polimera 2 - పొలిమేర 2 సినిమా ఎలా ఉందంటే…ఇది భయపెట్టే సినిమానేనా ?

పొలిమేర 2 సినిమా ఎలా ఉందంటే…ఇది భయపెట్టే సినిమానేనా ?

దర్శక రత్న దాసరి బ్రతికి ఉంటె ఇప్పుడొస్తున్న చిన్న సినిమాల ట్రెండ్ చూసి ఆనందంతో సంతోషించేవారు. దాసరి అనుక్షణం చిన్న సినిమా కోసం తపించేవారు. తక్కువ బడ్జెట్ సినిమాల ప్రాధాన్యతను అనుక్షణం తోటిదశకులతో పంచుకుంటూ ఉండేవారు.

ఆ క్రమంలోనే పూరి జగన్నాథ్ కి కూడా ఒక పర్యాయం చిన్న సినిమాల విశిష్టత తెలియజెప్పారు. ఇప్పుడు చిన్న సినిమాల గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందా అని మీకు సందేహం రావచ్చు. తాజాగా విడుదలైన కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.

మరీ ముఖ్యంగా పొలిమేర 2 గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో చేతబడి గురించి, గుప్త నిధికి సంబంధించిన విషయాలు చూపెట్టారు. ఇది పొలిమేర సినిమాకి సీక్వెల్ కాబట్టి పొలిమేర 2 చూసే వారు పార్ట్ 1 చుస్తే ఈ సినిమా బాగా అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది.

అనిల్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలాదిత్య, సత్యం రాజేష్, గెటప్ శీను, రాకేందు మౌళి, పృథ్వి రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో సత్యం రాజేష్ నటన నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. సత్తా ఉన్న నటుడు ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు అని చెప్పడానికి రాజేష్ చక్కని ఉదాహరణ. చేతబడి చేసే సన్నివేశాల్లో రాజేష్ లీనమై నటించాడు. అతని హావభావాలు ప్రేక్షకులను భయపెట్టేలా ఉన్నాయి అంటే ఏ రేంజ్ లో చేసి ఉంటాడు అని అర్ధం అయ్యి ఉండొచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం.

పొలిమేర 2 చూసేవారు పొలిమేర పార్ట్ 1 కూడా చూస్తేనే బాగా అర్ధం అవుతుంది అని ఎందుకు చెప్పరంటే, ఆ సినిమాలో ఎక్కడైతే కధ ముగిసిందో అక్కడి నుండే ఈ కథ మొదలవుతుంది. మొదటి భాగంలో కొమిరయ్య అలియాస్ కొమిరి కవితను చేతబడి చేసి చంపేసినట్టు జంగయ్య తెలుసుకుంటాడు.

జంగయ్య ఎవరో కాదు కొమిరికి తమ్ముడే. కానీ కొమిరి చేతిలో చనిపోయిన కవిత కానీ, కవిత చితిలో పడి కాలిపోయాడనుకున్న కొమిరి కానీ ఇద్దరు కేరళ రాష్ట్రంలో ప్రాణాలతోనే ఉంటారు. అది ఎలా సాధ్యమైంది అని చూపెట్టడానికి దానిని మొదటి భాగం చివరిలో చూపిస్తాడు దర్శకుడు. అందుకే రెండవ భాగం చూసే వారు మొదటి భాగం చూడటం తప్పనిసరి.

ఎస్సై రవీంద్ర నాయక్‌ జాస్తిపల్లి స్టేషన్ కు బదిలీ అయినా వెంటనే కొమిరి కేసును తిరిగి ఓపెన్ చేశాడు. అదే విధంగా తన అన్నను చేతబడి నెపంతో చంపేశారని కేసు పెట్టిన జంగయ్య ఆకేసును వాపసు తీసుకున్న తరువాత అసలు కనిపించకుండా పోతాడు. పైగా జాస్తిపల్లి పొలిమేరలోని ఏకపాదమూర్తి గుడికి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి ఉన్న లింక్ ఏంటి అనే కోణంలో విచారణ మొదలు పెడతాడు.

కొమిరి తనతోపాటు బలిజ భార్యను కూడా కేరళ తీసుకెళ్లినట్టు ఎస్.ఐ కి తెలుస్తుంది. మరి కొమిరితో కేరళలో ఉన్న కవిత ఏమైనట్టు. అసలు బలిజ భార్య కొమిరితో కేరళ ఎందుకు వెళ్ళింది. ఇలాంటి అనేకమైన ట్విస్టులను సినిమాలో దట్టించేశాడు దర్శకుడు.

అందుకే ఈ సినిమా చుసిన ప్రేక్షకుడికి కొంత గందరగోళం కూడా ఏర్పడుతుంది. అయితే ట్విస్టులు, సర్ప్రైసింగ్ సీన్లు ఇష్టపడేవారికి ఇది తప్పకుండ నచ్చుతుంది. ఇక ఈ సినిమాలో పృథ్వి రాజ్ ఎంట్రీ బాగుంటుంది. బలిజ పాత్రలో కనిపించే గెటప్ శీను పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. బాలాదిత్య చేసిన జంగయ్య పాత్ర కూడా ఎక్కువ సేపు కనిపించదు. దర్శకుడు ఈ పాత్రను మూడవ భాగంలో ఎక్కువగా చూపెట్టే ఛాన్స్ ఉండొచ్చు.

అయితే ట్విస్టులు పెట్టి త్రిల్ చేద్దామనే ఉద్దేశంతో దర్శకుడు ప్రధాన కథను కాస్త విస్మరించాడు అన్నది అర్ధం అవుతుంది. కొన్ని సీన్లలో కదా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకుడిని కొంత అయోమయం లోకి నెట్టేస్తుంది.

దర్శకుడు కథను మాటిమాటికి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లడం ప్రెసెంట్ సీన్ లోకి తీసుకురావడం వంటివి చేస్తూ ఉంటాడు. అంతే కాకుండా ఒకే సందర్భాన్ని వేరు వేరు వ్యక్తుల కోణంలో చేపట్టాడు అనిపిస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ ముగించే సమయంలో సెకండ్ పార్టీ కి లీడ్ సీన్స్ పెట్టినట్టే, సెకండ్ పార్ట్ ముగిసే సమయంలో థర్డ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ కొన్ని సీన్లను పెట్టి సినిమా ముగించాడు డైరెక్టర్.

Leave a Comment