Madhavi Latha Sensational Comments on RASHMIKA DEEPFAKE Video : ఫేక్ వీడియో పై మాధవి లత సెన్సేషనల్ కామెంట్స్.
చాలా కాలంపాటు సైలెంట్ గా ఉండిపోయిన మాధవి లత ఇప్పుడు సడన్ గా వార్తల్లోకి వచ్చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెళ్ళకి ఇంటర్వ్యులు ఇస్తున్నారు. కేవలం ఇంటర్వ్యూ లు ఇవ్వడమే కాదు.
అందులో యాంకర్లు అడిగే ప్రశ్నలకు ఎంతమాత్రం తడుముకోకుండా బోల్డ్ గా సమాధానం చెప్పేస్తోంది మాధవి లత. ఈ నేపథ్యంలోనే మాధవి ముందు రష్మిక మందన్న ఎదుర్కొన్న మార్ఫింగ్ వీడియో విషయాన్నీ ప్రస్తావించాగా, అందుకు మాధవి లత ఇచ్చి న సమాధానం అవాక్కయ్యేలా చేసింది.
ఆమె అటువంటి సమాధానం ఇస్తుందని ఎవ్వరు ఊహించలేకపోయారు.రష్మిక ఏమీ సావిత్రి, సాయి పల్లవి, మాధవీలతలా పద్దతిగా కనిపించదు.
ఆమె కొన్ని ఫంక్షన్లు, కొన్ని సినిమాల్లో ఓవర్ డోస్ ఎక్స్ పోసింగ్ ఇస్తుందని కూడా పేర్కొంది. అందులోను రష్మిక డీప్ ఫేక్ వీడియో మరీ అంత దారుణంగా, అసభ్యకరంగా ఏమీ లేదని, ఆమె కంటే రష్మిక ఇంకా దారుణమైన దుస్తులు వేసుకుని, ఈవెంట్లకు వెళుతూ ఉంటుందని తెలిపింది.
ఒక స్టార్ హీరోయిన్ ఓ సంఘటనపై మాట్లాడితే ఇలానే ఉంటుందని, చూసే వారు మాత్రమే కాక ఆమె సహనటులు కూడా తప్పక స్పందిస్తారని తెలిపింది.
రష్మిక విషయంలో కేవలం నటీనటులు మాత్రమే కాక జర్నలిస్టులు కూడా మద్దతుగా నిలిచారని అన్నారు. అది చూసి తనకు నవ్వొచ్చిందన్నారు. జర్నలిస్టులు చేసింది తప్పకుండా మెచ్చుకోదగ్గ విషయమే, అయితే జర్నలిస్టులు ముందుగా అండగా నిలవాల్సింది బయట అన్యాయానికి గురవుతున్న ఎంతో మంది మహిళలకు అని తెలిపింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్ఫింగ్ మాఫియా పై ఉక్కు పాదం మోపాలని చూస్తున్న సమయంలో మాధవి లత మాటలు మరోలా ఉన్నాయి.
అయితే మాధవి లత మాటలకు సోషల్ మీడియాలో మద్దతు కూడా లభిస్తోంది. మొదటి సారి సరిగ్గా మాట్లాడావ్ అంటూ కొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
2019 ఎన్నికల సమయంలో మాధవి లత బీజేపీ తరుపున పోటీ చేశారు. కానీ ఆమెను పరాజయమే పలుకరించింది. గత కొంత కాలం ఆమె అనారోగ్యానికి గురైనసమయంలో ఆ పార్టీ వారు కనీసం తనను పట్టించుకోలేదని కూడా ఆమె చెప్పి వాపోయింది.