Dhoni Sent gift to hero nithin: టాలీవుడ్ హీరో నితిన్ కి మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకమైన బహుమతి.
” ఎక్స్ట్రార్డినరీ వ్యక్తి నుంచి వచ్చిన అసాధారణ బహుమతి ” – నితిన్
టాలీవుడ్ హీరో నితిన్ కి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ప్రత్యేకమైన బహుమతి.
హీరో నితిన్ కి మన భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. అదేంటంటే.
తను సంతకం చేసిన టీ షర్ట్ ని బహుమతిగా పంపాడు, సంతకం తో పాటుగా బెస్ట్ విషెస్ అని కూడా రాశాడు.
ఈ బహుమతి గురించి నితిన్ ట్విటర్ లో షేర్ చేస్తు, ”ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తి నుండి వచ్చిన అసాధార బహుమతి ” అని తన సంతోషాన్ని పంచుకున్నాడు, ఇదే క్రమంలో ధోనీకి నితిన్ ధన్యవాదాలు తెలిపాడు.
ప్రస్తుతం నితిన్ ఇప్పడు ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వక్కాతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
నితిన్, శ్రీలీల కలిసి నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ధోనీ నుంచి బహుమతి అందుకోవడంతో నితిన్ ఆనందంగా సినిమా విడుదలని దృష్టిలో పెట్టుకొని,”ఎక్స్టాఆర్డినరీ వ్యక్తి నుంచి వచ్చిన అసాధారణ బహుమతి” అని ట్వీట్ చేసారు.
ఈ సినిమాలో నితిన్ అభి అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర కి ఏదో ఒక పెద్ద కల ఉంటుంది.
కొద్ది రోజుల క్రితమే ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ ట్రైలర్ విడుదల అయింది.
ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్, రావు రమేష్, అన్నపూర్ణ, పవిత్ర నరేష్, రవి వర్మ, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ నితిన్ యొక్క 32 వ సినిమా. తన 21 ఏళ్ళ సినిమా జీవితంలో ఈ సినిమా బెస్ట్ అని చెప్పుకొచ్చాడు.
శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు మంచి హిట్టు అయ్యాయి.ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చారు.
వక్కాతం వంశీ రాసిన రేసుగుర్రం, కిక్, టెంపర్ లాంటి అల్ట్రా కామిడీ ఉన్న సినిమాల కన్నా ఈ సినిమా మరింత ఎంటర్టైనింగ్ గా ఉంటుందని నితిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.