Mahesh another grand event in memory of Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకార్ధం మహేష్ మరో బృహత్తర కార్యక్రమం..
సూపర్ స్టార్ కృష్ణ, నిజ జీవితంలో నటటించడం రాని, మహా నటుడు అనే పేరు సంపాదించుకున్న వ్యక్తి. కేవలం వెండి తెరమీద మాత్రమే నటిస్తూ ఇండస్ట్రీలో నలుగురితో శభాష్ అనిపించుకున్న మహోన్నతుడు. నిర్మాతల పాలిట పెన్నిధి గా పేరు గడించాడు నటశేఖరుడు. మరి అటువంటి కృష్ణ కి నట వారసుడిగా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి కృష్ణకి అమితానందాన్ని కలిగించారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా మానవతా విలువలు, సేవాగుణంతో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు మహేష్ బాబు. తాను చేసే సేవాకార్యక్రమాలతో సూపర్ స్టార్ కృష్ణకి ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టాడు మహేష్ బాబు. ఇప్పటికి నిర్విరామంగా ఆ సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అందులోనే మహేష్ మరో అడుగు ముందుకేశారు. అదేమిటో చూద్దాం.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన మహేష్ ఆ సినిమా లో చెప్పిన విషయాన్నీ ఆచరణలో పెట్టి చూపించాడు. తన తండ్రి పుట్టిన ఊరు బుర్రిపాలెం ను దత్తత తీసుకున్నాడు. ఆ ఊరికి విద్య, వైద్యం ఇలా అన్నింటా తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆతరువాత మహర్షి సినిమాలో మహేష్ వీకెండ్ ఫార్మింగ్ చేయగా అది కూడా ట్రేండింగ్ అయింది. అయితే సినిమాలో చూపించిన ఈ విషయాలనే కాక నిజజీవితంలో మహేష్ మరెన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఆయన చేసే మంచి పనులు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అదే చిన్నారులకు గుండె ఆపరేషన్. ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2500 మందికి ఈ హార్ట్ సర్జరీలు చేసి ఔరా అనిపించాడు. తాను ఈ ఆపరేషన్లకు, పల్లెటూళ్లను బాగుచేయించడానికి వెచ్చించిన డబ్బుతో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు ఆలా చేసినా అడిగేవారు ఉండరు. కానీ తాను సంపాదించిన డబ్బుతో మంచి పనులు చేస్తూ తన తల్లి తండ్రుల పేరు నిలబెడుతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ .
ప్రస్తుతం చేస్తున్న సేవ కార్యక్రమాలకు అదనంగా మహేష్ బాబు తన తండ్రి పేరుమీద మరో మహత్కార్యం చేపట్టాడు. పేద పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ పేరు మీదుగా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు స్కాలర్ షిప్ ఇస్తూ ఉచితంగా విద్యను అందిస్తున్నారు. 40 మంది పేద విద్యార్థులకు విద్య కోసం సహాయం అందిస్తున్నాడు. వారు ఉన్నత విద్యను అభ్యసించే వరకు అయ్యే ఖర్చును ఎంబీ ఫౌండేషన్ భరిస్తుందట. అయితే మహేష్ వల్ల లబ్ది పొందుతున్న విద్యార్థులు కూడా తాము బాగా చదువుకుని అయనకి మంచి పేరు తెస్తామని అంటున్నారు. ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో మహేష్ ఫాన్స్, కృష్ణ ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. నెటిజన్లు కూడా మహేష్ మంచితనానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.