
Mahesh Babu and Prabhas fans are fire on Allu : మంగళ్ వరణ్ టీమ్ పై మహేష్ బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఫాన్స్ కి మరో స్టార్ హీరో ఫాన్స్ తో పడదు. మా హీరో గొప్పోడు అంటే కాదు మా హీరోనే గొప్పోడు అంటూ వాదించుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ వాదులాటలు ముదిరి ఫైటింగుల వరకు వెళుతుంటాయి. ఇదంతా ఫాన్స్ వరకే. కానీ స్టార్ హీరోలు మాత్రం టైం దొరికితే చాలు ఒకే టేబుల్ పై పేకాట కూడా ఆడేస్తారు. అలా పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కేశారు మహేష్ బాబు వెంకటేష్. కానీ ఒక్కోసారి ఫాన్స్ తమ అభిమాన హీరోల కోసం గొడవ పాడటానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉంటాయి. కారణాలు ఉన్నంత మాత్రాన గొడవకు దిగమని ఎవ్వరు చెప్పరు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోమని సూచిస్తారు. అయితే ఇప్పుడు ఏ విషయంలో గొడవ జరిగింది, ఏ హీరో ఫాన్స్ ఎవరి పై మండి పడుతున్నారు అన్న విషయం చూద్దాం.
ఆర్.ఎక్స్ 100 సినిమా తీసిన అజయ్ భూపతి ఎంత ఫెమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాతో హీరో కార్తికేయకి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా తరవాత హీరో హీరోయిన్లు దాదాపు డజను సినిమాల వరకు చేసినట్టున్నారు. కానీ దర్శకుడు అజయ్ భూపతి నుండి ఆర్.ఎక్స్ 100 తరవాత మహాసముద్రం మాత్రమే వచ్చింది. ఆయన నుండి వస్తే విభిన్నమైన సినిమానే వస్తుంది అని ఎదురుచూస్తోంది టాలీవుడ్. అటువంటిది అయన మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. మంగళవారం సినిమా ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మరి తమ సినిమా ఫంక్షన్ కి స్టార్ హీరో వచ్చాడు అంటే ఆ చిత్ర యూనిట్ అతడి గురించి ఒక ఏవి వేస్తుంది, ఆ ఏవిలో మోత మోగించేస్తుంది. అదే చేసింది మంగళవారం టీమ్ కూడా. కాకుంటే ఒక అడుగు ముందుకేసి సౌత్ ఇండియన్ హీరోల్లో ఇంత వరకు మేడం టుస్సాడ్‌లో ఎవరి విగ్రహం లేదన్నట్టుగా చెప్పుకొచ్చింది. బన్నీకే ఆ ఘనత దక్కినట్టుగా భజన చేసింది.
ఇక్కడే ప్రభాస్ ఫాన్స్ కి, మహేష్ ఫాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. దక్షిణాది నుండి మేడం టుస్సాడ్‌లో ప్రభాస్‌ది మొదటి విగ్రహం అని, ఆ తరువాత మహేష్ బాబు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారని వారు చెబుతున్నారు. కానీ ఈ విషయం బన్నీ పిఆర్ టీమ్ కి గాని, మంగళవారం టీమ్ కి గాని నిజంగానే తెలీదా, లేకపోతె తెలిసినా కావాలనే తప్పు చేశారా అని మండి పడుతున్నారు. మరి ఈ క్రమంలో తాము చేసిన ఈ మిస్టేక్ మీద మంగళవారం టీం గానీ, బన్నీ పీఆర్ టీం గానీ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.
ఇక మేడం టుస్సాడ్స్ విషయానికి వస్తే లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో ప్రభాస్, సత్యరాజ్ విగ్రహాలు ఉండగా, సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియం లో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ విగ్రహాలు ఉన్నాయి. ఇక దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యుజియంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.