Mahesh Babu with indonesian beauty in next movie : ఆర్ఆర్ఆర్ (RRR ) సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో (Mahesh Babu) మరో సహసోపేతమైన మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే.
మహేష్, జక్కన్న ల సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు కథ తెలియకముందే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR ) కి మించి ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని మహేష్ ఫ్యాన్స్ ముందుగానే సినిమాపై ఆశలు పెంచుకుంటున్నారు.
ఈ మూవీ ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ఇప్పటికే రాజమౌళి రివీల్ చేశారు. జక్కన్న తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) కథను కూడా ఈమధ్యనే పూర్తి చేశారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. మహేష్ కూడా రీసెంట్ గా జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. ఈ మూవీ గురించి రోజూ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Indonesian beauty as heroine : హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ :
మహేష్ (Mahesh)తో రాజమౌళి (Rajamouli) సినిమా అని చెప్పినప్పటి నుంచి ఈ మూవీపై రోజుకో రూమర్ నెట్టింట్లో పుట్టుకొస్తుంది . ఈ భారీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) నటిస్తున్నారని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.
అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అదే విధంగా హాలీవుడ్‌లోనూ తెలుగోడి సత్తా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో అక్కడి హీరోయిన్ ను తీసుకోనున్నారని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది. ఆ టాక్ కు తగ్గట్లే ప్రముఖ ఇండోనేషియా (Indonesia) యాక్ట్రెస్ చెల్సియా ఇస్లాన్ (Chelsea Islan)మహేష్ కు జోడీగా కనిపించనుందని తెలుస్తోంది.
ఆల్రెడీ RRRలో ఎన్టీఆర్(NTR)కు జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ (Olivia Morris)ను తీసుకొచ్చిన రాజమౌళి…ఇప్పుడు చెల్సీ ఇస్లాన్‌ను మహేష్‌కు జోడీగా చూపించే ప్లాన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ న్యూస్ ఎంత వరకు వాస్తవం అన్నదనిపై స్పష్టత లేదు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం చెల్సియా ఇస్లాన్ ఈ సినిమాలో ఖచ్చితంగా నటిస్తుందని అంటున్నారు. ఎందుకంటే జక్కన్నను ఇన్స్టాగ్రామ్ లో చెల్సియా ఇస్లాన్ ఫాలో అవుతుంది. దాంతో మహేష్ మూవీలో ఈ భామ ఫిక్స్ అని ఫ్యాన్స్ పిచ్చ క్లారిటీతో ఉన్నారు.
Amazing Mahesh Look : మహేష్ లుక్ అదుర్స్
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా విడుదలైంది. ఈ మూవీ 250కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో మహేష్(Mahesh) యాక్టింగ్ కు, డాన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఈ మూవీ తర్వాత మహేష్, రాజమౌళి (Rajamouli)తో సినిమా చేస్తున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో లేటెస్టుగా మహేష్ కొత్త లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మహేష్ లుక్ మాత్రం వేరే లెవెల్ అని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఈ లుక్ లో ప్రిన్స్ అదిరిపోయాడని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
హాలీవుడ్ హీరోలను సైతం పక్కకు నెట్టేసేలా మహేష్ ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో మహేష్ నటిస్తున్నSSMB29 సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.