Makara Jyothi 2023: మకర జ్యోతి దర్శనం తరువాత ఆలయం ఎందుకు మూసి వేస్తారో తెలుసా?

Makara Jyoti Darshan Do you know why Ayyappa Temple is closed

Makara Jyothi 2023: మకర జ్యోతి దర్శనం అయ్యప్ప ఆలయం ఎందుకు మూసి వేస్తారో తెలుసా?

శబరిమల ఆలయం అంటేనే దేశ వ్యాప్తంగా భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు. ఈ సంవత్సరం కేరళ లో ఉన్న ఈ అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్ధి కూడా బాగా పెరిగిపోయింది.

ఆ ఆలయ ఆదాయం కూడా 200 వందల కోట్ల రూపాయలకు చేరింది. అయితే, ఈ ఆలయాన్ని మూసివేస్తున్నామని ఆ ఆలయ ట్రష్టు అధికారులు ప్రకటించారు. మరి ఎందుకు ఈ ఆలయాన్ని మూసివేస్తారో.. ఇప్పుడు తెలుసుకుందాం…

హరిహర కుమారుడు అయ్యప్ప దర్శనం కోసం ఈ ఏడాది భక్తులు భారీ స్థాయిలో పోటెత్తారు. ఓ దశలో భక్తులకు ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భక్తులు సైతం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి కూడా ఈ సారి తలెత్తింది. ఈ క్రమంలో కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగి వెళ్లి పోయారంట.

మొత్తానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో స్వామి సన్నిధానం కళకళలాడిపోయిందని చెప్పవచ్చు. అంతేకాదు 5 వారాల్లో ఆ ఆలయ ఆదాయం ఏకంగా 200 కోట్ల రూపాయలకు చేరుకుంది.

అయితే,అయ్యప్ప స్వామి ఆలయాన్ని డిసెంబర్ 27 నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.అయ్యప్ప మాల వేసిన భక్తులు మండలం 41 రోజులు స్వామి సేవలో తరిస్తారు.

ఆ తర్వాతే ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి కేరళ బయలుదేరుతారు. శబరిమల ఆలయంలోనూ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు డిసెంబర్ 27తో ముగియబోతున్నాయి.

కాబట్టి రాత్రి పూజా కార్యక్రమాల అయిపోయిన తరవాత 11 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్టు ట్రావెన్‌కోర్‌ బోర్డ్‌ అధికారులు తెలియజేశారు.

మకర జ్యోతి దర్శనం ఉత్సవాలు ముగిసిన తర్వాత.. జనవరి 20న ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ రోజు అయ్యప్ప సన్నిధానం తలుపులు మూసివేయడంతో..

శబరిమల వార్షిక యాత్ర ముగుస్తుంది. ఇందుకోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారుఈ ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులతో శబరిమలకు భారీస్థాయిలో తరలివచ్చారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి మాలధారులు భారీగా అయ్యప్పస్వామి సేవలో పాల్గొని, 41 రోజులపాటు అయ్యప్ప స్వామి వారిని సేవించుకున్నారు.

Leave a Comment