Pushpa2 Movie: ఐకాన్ స్టార్ (Iconic star) అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన పుష్ప మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి వరల్డ్ వైడ్‌గా భారీ కలెక్షన్లను రాబట్టింది. సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers) పతాకంపై నవీన్ ఎర్నేని,
రవి శంకర్ నిర్మించిన ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అల్లు అర్జున్ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్కు ఆల్ ఇండియా ఫిదా అయిపోయింది.
ఈ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా నటించిన రష్మిక మందన(Rashmika Mandanna) కూడా నేషనల్ క్రష్(National Crush)గా మారిపోయింది. పుష్పకు వచ్చిన రెస్పాన్స్ చూసి దానికి సీక్వెల్‌ను అదే రేంజ్లో తీసేందుకు డైరెక్టర్ సుకుమార్ ఓ రేంజ్లో కసరత్తు చేస్తున్నాడు.
ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ (Pushpa the raise)లో తన థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.
ఇక అప్పటి నుంచి అభిమానులు పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ (pushpa2 The Rule)కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచాలను ఏర్పడ్డాయి.
ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే పుష్ప2 రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో పుష్ప2 వాయిదా పడిందంటూ న్యూస్ వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో ఈ గందరగోళంపై తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ ఊపిరి పీల్చు
pushpa2 will release on time : అనుకున్న సమయానికే పుష్ప2 రిలీజ్
Exclusive : Again Confirmed To Production Team ✅ Pan India Start #AlluArjun – Pushpa 2 Releasing For 15 August Month 👀
— Movie Tamil (@MovieTamil4) January 2, 2024
Follow For @MovieTamil4
This Movie Shooting Going On ⚡
One By One Promotion Start From April Month Start ✅#Pushpa2TheRule | #Pushpa2 | #FahadhFaasil… pic.twitter.com/BNjxEsXG7p
ఈ కొత్త ఏడాది ఆగస్టు 15(August 15) న స్వతంత్ర దినోత్సవం రోజు పుష్ప2 (pushpa2)ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అయితే మంగళవారం పుష్పా2 రిలీజ్ వాయిదా పడిందన్న రూమర్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే అనుకున్న సమయానికే పుష్ప2 విడుదల అవుతుందని లేటెస్టుగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
నిజానికి పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల కంటే హిందీ బెల్ట్ లోనే భారీ వసూళ్లను రాబట్టింది. ఇఫ్పుడు పుష్ప 2 కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
మూవీ నుంచి అప్డేట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ క్లారిటీతో అల్లు అర్జున్ మానియాతో పుష్ప2 కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది.
Singham Again vs Pushpa 2 : బాక్సాఫీస్ బరిలో పుష్ప2- సింగం అగైన్
అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన పుష్ప2, అజయ్ దేవ్గన్ (Ajay Devagan) నటించిన సింగం అగైన్ (Singam Again) సినిమాలు రెండూ కూడా ఆగస్టు 15న విడుదలకు రెడీ అయ్యాయి.
దీంతో బాక్సాఫీస్ వద్ద యాక్షన్ బొనాంజా తప్పదని తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో విడుదలైన పుష్ప రిలీజై రెండేళ్లు అవుతోంది. అయితే ఫ్యాన్స్ అంతా పుష్ప సీక్వెల్ 2022లో విడుదల అవుతుందని ఆశపడ్డారు.
అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ఎట్టకేలకు ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్, అజయ్ దేవగన్‌న అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.
తమ అభిమాన స్టార్ సినిమా మరొకరిని డామినేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2
బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అంటుంటే అటువైపు అజయ్ దేవగన్ ఫ్యాన్స్ సింఘం ఎగైన్ రికార్డ్‌లను క్రియేట్ చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే పుష్ప 2(pushpa2) మానియాతో సింగం మళ్లీ వాయిదా పడుతుందనే టాక్ కూడా బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది.
మరి సింగం ఎగైన్ మేకర్స్ రిలీజ్ విడుదల తేదీని మారుస్తారా? లేకపోతే పుష్ప2తో క్లాష్ కి రెడీ అవుతారా అన్నది తేలాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.
Pushpa2 theatrical rights Rs. 200 crores పుష్ప2 థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లు
పుష్ప(Pushpa) హిట్ తో అంతకు మించిన భారీ బడ్జెట్ తో పుష్ప ది రూల్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ (Theatrical rights) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.200 కోట్లకు సేల్ అవుతున్నట్లు టాక్.
ఇప్పటి వరకూ సౌత్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR)మాత్రమే ఇంత భారీ మొత్తానికి అమ్ముడైంది. రీసెంట్ గా రిలీజైన డార్లింగ్ ప్రభాస్ ( Prabha) నటించిన సలార్ (Salaar) మూవీ రూ.160 కోట్లకు అమ్ముడుపోయింది.
ఈ క్రమంలో పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ విషయంలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని బయ్యర్లు భావిస్తున్నారని ఇన్ఫర్మేషన్