Pushpa The Rule Teaser: పుష్ప2 టీజర్…అమ్మోరు గెటప్‎లో బన్నీ జాతరే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కాంబోలో వస్తున్న మూవీ పుష్ప 2 (Pushpa2).‘పుష్ప ది రూల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఆగస్టు 15న పుష్ప2ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కనిపించనుంది. బన్నీ, సుకుమార్ కాంబోలో గతంలో వచ్చిన పుష్ప (Pushpa) థియేటర్స్ ను షేక్ చేసింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పుష్పకు సీక్వెల్ గా పుష్ప2ను తెరకెక్కించబోతున్నారు. పుష్పను మించి ఈ మూవీని ఉండేలా మేకర్స్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ ఏర్పడ్డాయి. ఈ మధ్యనే పుష్పగాడి శ్రీవల్లి లుక్ ను మేకర్స్ రివీల్ చేసి ఫ్యాన్స్ ను ఖుష్ చేశారు. ఇక తాజాగా ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో మూవీ యూనిట్ పుష్ప2 టీజర్ (Pushpa2 Teaser)ను గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

puspa 2 Pushpa The Rule Teaser: పుష్ప2 టీజర్…అమ్మోరు గెటప్‎లో బన్నీ జాతరే

చొక్కాలు చింపుకోవడానికి రెడీ అవ్వండి :
ఇవాళ అల్లు అర్జున్ (Allu Arjun)బర్త్ డే. పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నాడు బన్నీ. ఇదే క్రమంలో బన్నీకి బర్త్ డే గిఫ్ట్ గా పుష్ప2 (pushpa2)మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ మాస్ ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది. చీరకట్టులో కాళ్లకు గజ్జలు పెట్టుకుని మాస్ ఫైట్స్ తో యాక్షన్ సీన్స్ తో అల్లు అర్జున్ అదుర్స్ అనిపిస్తున్నాడు. తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో సుమారు 66 సెకండ్ల టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు జాతియా స్థాయిలో బన్నీ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా టీజర్ కట్ చేశారు. ఈ టీజర్ మాత్రం వేరే లెవెల్ అంటూ బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ (Sukumar)మరోసారి ఊరమాస్ గా బన్నీని చూపించాడు. ఈ టీజర్ విడుదలైన కొన్ని నిముషాలకే నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బన్నీ లుక్స్ గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి. సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. చొక్కాలు చింపుకోవడానికి రెడీగా ఉండండి అంటూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

puspa 2 Teaser Pushpa The Rule Teaser: పుష్ప2 టీజర్…అమ్మోరు గెటప్‎లో బన్నీ జాతరే

పుష్ప-2పై భారీ అంచనాలు :

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా బాక్సీఫీస్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. పుష్పలో బన్నీ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ప్రపంచ నలుమూలలకు పాకింది. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మ్యానరిజంకు కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుతో మరింత ఉత్సాహంతో సుకుమార్ (Sukumar)పుష్ప2 తెరకెక్కిస్తున్నాడు. పుష్ప సీక్వెన్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ లో రూపొందుతున్న పుష్ప-2 (Pushpa2) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి కూడా దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad)సంగీతం అందిస్తున్నాడు. మరి దేవిశ్రీ రూపొందించిన ఈ జాతర సాంగ్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Leave a Comment