బాక్స్ ఆఫీసును దున్నేస్తున్న మలయాళ సినిమాలు…..

CS images 2024 04 24T174307.136 1 బాక్స్ ఆఫీసును దున్నేస్తున్న మలయాళ సినిమాలు…..

మొదటినుండీ మలయాళం సినిమాకు మంచి పేరువుంది. విభిన్న తరహాలో కధను చెప్పటంలో మలయాళీ దర్శకులు దిట్ట ,అసలు కధ లేకుండానే 3 గంటలు సీట్లలో కూర్చునే లా చేయటం మలయాళీ దర్శకుల స్పెషల్. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా మంజుమల్ బాయ్స్ ఇందుకు ఓ చిన్ని ఉ దాహరణ, ఇప్పుడు ఈ కోవలోకి మరో సినిమా ఓటీటీ లో దున్నేస్తోంది. జిత్తు మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన “ఆవేశం “. ఓటీటీ లో సందడి చేస్తోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ వ్యూస్ లోనూ న్యూస్ లోనూ ఇండియాలోనే నెంబర్ 1 గా ట్రెండింగ్ అవుతోంది. సాధారణ మైన కధను ఆసక్తిగా నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టి పడేస్తోందట .యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాకు పెద్ద అసెట్గా నిలిచాయట. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు చూస్తున్న ఈ సినిమా నిజంగానే ట్రెండ్ సెట్టర్ అంటున్నారు. వొందల కోట్ల బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకొనే మన టాలీవుడ్ నిర్మాతలకు మలయాళీ సినిమాలు చూసి నేర్చుకోవాలి ని టాలీ వుడ్ లో టాక్.

Leave a Comment