Maldives About India: మోదీ పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.

Add a heading 2024 01 09T170222.840 1 Maldives About India: మోదీ పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.


Maldives About India: ఎట్టకేలకు మాల్దీవ్స్ (Maldives) పొగరు అణిగింది, తలబిరుసు తనం తగ్గించుకున్న మాల్దీవ్స్ దారికొచ్చింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (MATI) ఖండించింది.

పైగా భారతదేశం (India) తనకు అత్యంత మిత్ర దేశమని పొగడ్తల్లో ముంచెత్తింది. కరోనా సమయంలో భారత్ తనకి ఎనలేని సహాయాన్ని కూడా అందించింది అని కీర్తించింది.

మాల్దీవ్స్ ను సంక్షోభాలు చుట్టుముట్టిన సమయంలో భారత్ అండగా నిలిచిన విషయాన్నీ కూడా గుర్తుచేసుకుంది, మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ.

ఈ సహకారం రానున్న రోజుల్లో కూడా ఇదే మాదిరిగా కొనసాగాలని పిలుపునిచ్చింది. ఇలాంటి సహకారం అందించినందుకు గాను భారత దేశానికి, భారత దేశ ప్రజలకు నాయకులకు మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ కృతజ్ఞతలు తెలియజేసింది.

క్షవరం అయితే గాని వివరం రాలేదు :Huge Damage Made To Realize

అయితే మాల్దీవ్స్ ఉన్నట్టుండి దిగిరావడానికి కారణం కూడా లేకపోలేదు, కేవలం టూరిజం మీదనే ఆధారపడి మాల్దీవ్స్ ప్రభుత్వం ఎక్కువశాతం అందిస్తోంది,

అక్కడ ఉన్న ప్రకృతిసిద్ధమైన అందాలను ఆస్వాదించాలని ఉద్దేశంతో ప్రతి ఏడాది భారతీయులు వేలు లక్షల సంఖ్యలో అక్కడికీ వెళుతూ ఉంటారు.

దీంతో వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతోంది. అయితే భారత్ ను తక్కువ చేసి మాట్లాడిన ఆ మంత్రుల (Maldives Ministers) మాటలను మన దేశ పౌరులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.

కేవలం గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో హోటల్ బుకింగ్స్ అలానే ఫ్లయిట్ టికెట్స్ బుకింగ్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. పైగా అనేకమంది భారతీయుడకు బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటూ(#BoyCott Maldives)

కొంతమంది అప్పటికే బొకింగ్ చేసుకున్న ఫ్లయిట్ టికెట్స్ అలాగే హోటల్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని ఆ క్యాన్సిలేషన్ స్క్రీన్ షాట్లను ఇన్ స్టా, ట్విట్టర్ (Twitter), పేస్ బుక్ వంటివాటిలో షేర్ చేశారు.

అంతే కాదు మాల్దీవ్స్ కి ప్రత్యామ్నాయంగా మన దేశం లో ఉన్న లక్షద్వీప్ ఐలాండ్స్ (Lakhshya Dweep Islands) ను ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో పరిస్థితి చేయి దాటితే జరిగే నష్టాన్ని పూడ్చలేము అన్న విషయాన్నీ గ్రహించిన మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం దిగివచ్చింది.

Leave a Comment