పీకల్లోతు అప్పుల్లో మాల్దీవ్స్ – మాట మార్చిన ముయిజ్జూ – అప్పులకు కారణం ఎవరు ?

website 6tvnews template 2024 03 23T122747.467 పీకల్లోతు అప్పుల్లో మాల్దీవ్స్ - మాట మార్చిన ముయిజ్జూ - అప్పులకు కారణం ఎవరు ?

క్షవరం అయితే గాని వివరం రాదనీ అన్నారు పెద్దలు, మాల్దీవులకు విషయం కూడా ఇదే సామెత సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు భారత్ మీద అవాకులు చవాకులు పేలిన ఆదేశం ఇప్పుడు బేలా పలుకులు పలుకుతోంది. అందుకు కారణం ఆ దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడటమే. మొదట్లో చైనా అండ చూసుకుని రెచ్చిపోయింది.

కన్నూ మిన్నూ కానకుండా భారత దేశం పట్ల వ్యతిరేక ధోరణిని అవలంబించింది. ఇది చాలదన్నట్టు ఆదేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ(President Mohammed Muizzoo) ఏకంగా ‘ఇండియా ఔట్’(India Out) అనే నినాదాన్ని జపిస్తూ అధికారంలోకి వచ్చాడు. ప్రెసిడెంట్‌గా(Maldives President) ఎన్నికైనా కొత్తలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఇది మాత్రమే కాదు, భారత్ కి యే మాత్రం సరిపడని చైనాతో సైనిక ఒప్పందాన్ని(A military pact with China) కుదుర్చుకున్నాడు. మే 10వ తేదీ నాటికి మాల్దీవ్స్ లో ఏ ఒక్క భారతీయ సైనికుడు కనిపించడానికి వీల్లేదని, వారంతా తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశాడు.

అప్పులే ఈమార్పుకి కారణం – Debt is the reason for this change

పోలె పోలె నీ భోగం ఎన్నాళ్లె అంటే మా అత్త సంతకెళ్లి వచ్చే వరకే అందట, చూస్తుంటే ముయిజ్జూ తీరు ఈ మాటకు చాలా దగ్గర ఉంది. భారత సైనికులు తమ దేశం విడిచి వెళ్ళిపోవాలి అని ఆర్డర్లు వేసినంత సమయం పట్టలేదు అతనా వాయిస్ లో సౌండ్ మారిపోవడానికి. ఇప్పటివరకు ఇండియా పేరు చెబితేనే అంతెత్తున ఎగిరి పడిన అతగాడు ఇప్పుడు ఉన్నట్టుండి మాట మార్చాడు, ఉన్నట్టుండి భారతదేశానికి అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆదేశ అధ్యక్షుడి మాటల్లో వచ్చిన ఈ సడన్ చేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేమిటంటే ప్రస్తుతం మాల్దీవ్స్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కాబట్టే రుణాల ఉబిలో నుండి బయటపడటానికి ఈ ద్వీప దేశం నటనా పటిమను బయటపెడుతోంది. ఇప్పుడు ముయిజ్జూ ఏమంటున్నాడంటే, రుణ విముక్తి కోసం భారత్ తమ దేశానికి ‘‘సన్నిహిత మిత్రదేశం’’గా కొనసాగుతుందని చెబుతున్నాడు. అప్పుల విషయానికి వస్తే 2023 సంవత్సరం చివరినాటికి, భారత దేశానికి మాల్దీవులు చెల్లించాల్సిన మొత్తం దాదాపు 400.9 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.

ముయిజ్జూ మాటల్లో మార్పు – A change in Muizzoo’s words

మర్చి 21వ తేదీనాటికి, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు ముయిజ్జూ(Muizzoo). పదవిలోకి వచ్చాక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. మాల్దీవులకు సాయం చేయడానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని,అంతే కాక పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసిందని కూడా చెప్పుకొచ్చాడు. భారతదేశం మాల్దీవ్స్ తో ఫ్రెండ్లి దేశంగానే కొనసాగుతుందని అందులో ఏ డౌట్ లేదని అన్నట్టు తెలుస్తోంది. మార్చి నెలలో భారత సైనిక సిబ్బంది మొదటి బ్యాచ్ మాల్దీవులను వదిలి వెళ్లిన తరువాత భారతదేశాన్ని కీర్తిస్తూ ఈ వ్యాఖ్యలు రావడం గమనించదగ్గ విషయం. కాగా మే 10 నాటికి మూడు విమానయాన ప్లాట్‌ఫారమ్స్ నిర్వహిస్తున్న 88 మంది సైనిక సిబ్బంది కూడా తమ దేశం వదిలి వెళ్లిపోవాలని ముయిజ్జూ కోరినట్టు సమాచారం.

మాల్దీవుల ప్రెసిడెంట్ అభ్యర్ధన – Request by the President of Maldives

WhatsApp Image 2024 03 23 at 12.27.47 PM పీకల్లోతు అప్పుల్లో మాల్దీవ్స్ - మాట మార్చిన ముయిజ్జూ - అప్పులకు కారణం ఎవరు ?

ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వాలు భారత్ వద్ద తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు రుణ ఉపశమనం కల్పించాలని భారత్‌ను ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ అభ్యర్ధించారు. భారత్ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు నిర్మాణంలో మినహాయింపులను అన్వేషించడానికి చర్చలు జరుపుతున్నట్లు ముయిజ్జూ పేర్కొన్నారు. అలాగే తమదేశంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిపివేయడానికి బదులుగా, వాటిని వేగవంతం చేయడానికె ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు పెద్దగా కనిపించలేదని వివరించారు.

గత పాలకుడు అప్పు – చైనా ఇచ్చిన భరోసా Debt of the previous ruler – guarantee given by China
భారత్(India) పట్ల మాల్దీవ్స్ (Maldives)సానుకూలంగా సామరస్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే మాల్దీవుల్లో ఏప్రిల్ నెలలో పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) నిర్వహించనున్నారు అందుకే వారి మాటల్లో ఈ మార్పు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. రుణాల చెల్లింపులో ఉపశమన చర్యలను భారత్ సులభతరం చేస్తుందని ముయిజ్జూ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక గతంలో మల్దేవ్స్ అధ్యక్షుడుగా ఉన్న ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్(Ibrahim Mohammed Solih) 1.4 మిలియన్ డాలర్లను రుణంగా తీసుకున్నారు. ఈ మొత్తాన్నిఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Export and Import Bank of India) మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, చైనా(China)-మాల్దీవుల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. డ్రాగన్ దేశం వీరికి గట్టిగానే భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. చైనా పర్యటకులను మాల్దీవులకు పంపుతామని మాటఇచ్చిందట. అంతే కాకుండా 130 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ని కూడా ప్రకటించినట్టు వినికిడి.

Leave a Comment