Maldivian Court Website Hacked: మాల్దీవ్స్ లో సైబర్ అటాక్ జువెనైల్ కోర్ట్ వెబ్‌సైట్ హ్యాక్.

Cyber ​​attack in Maldives: Juvenile court website hacked.


Maldivian Court Website Hacked: మాల్దీవ్స్ లో ఒక హఠాత్పరిణామం చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు సైబర్ నేరగాళ్లు, మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం(Office of the President of the Maldives),

విదేశాంగ మంత్రిత్వ శాఖ అలాగే పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ లను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సైబర్ దాడుల తరువాత తాజాగా ఇప్పుడు మాల్దీవియన్ జువెనైల్ కోర్ట్(Maldivian Juvenile Court) వెబ్‌సైట్ ను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.

మైనర్ల క్రిమినల్ కేసులను డీల్ చేసే మాల్దీవియన్ జువెనైల్ కోర్ట్ యొక్క వెబ్ సైట్ హ్యాక్ చేయబడిన్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ దారుణానికి పాల్పడిన వారు వెబ్‌సైట్, హ్యాకర్ల అసంతృప్తిని పైగా వారి సైబర్‌ ఎటాక్‌ కు గల కారణాలను ప్రతిబింబించే సందేశాన్ని ప్రదర్శించారు.

ప్రధాన కారణం ఇదే – This is the main reason

జువెనైల్ కోర్టు వెబ్‌సైట్‌పై సైబర్‌ఎటాక్ వెనుక ఉద్దేశం సందేశం ద్వారా వెల్లడించారు, మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన కొంతమంది సభ్యులు,

భారత ప్రధాని నరేంద్ర మోడీకి(PM Narendra Modi) వ్యతిరేకంగా ఆవేశపూరిత ప్రకటనలు చేశారు. మోదీ లక్షద్వీప్ ద్వీపాన్ని(Lakshadweep Island) ప్రమోట్ చేయడాన్ని వారు వ్యతిరేకించారు.

అందుకే వారు ఆయనకు వ్యతిరేక ప్రకటనలు చేశారు. కానీ హ్యాకర్ల అది నచ్చలేదు. అందుకే వారు ఇలా జువెనైల్ కోర్టు వెబ్‌సైట్‌పై సైబర్ దాడి చేసినట్టు వెల్లడించారు.

ఇక లక్షద్వీప్ భారతదేశంలోని(India) నైరుతి తీరంలో లోగల అరేబియా సముద్రంలో ఉంది. ఇది ఒక అందమైన, అద్భుతమైన ద్వీపాల సమూహంగా చెప్పబడుతుంది.

ప్రస్తుతం మాల్దీవియన్ జువెనైల్ కోర్ట్ వెబ్‌సైట్ ఆఫ్ లైన్ లో నే ఉంది. ఇది ఆఫ్ లైన్ లో ఉండగా హ్యాకర్ గ్రూప్ నుండి వచ్చిన సందేశాన్ని చూపిస్తోంది.

ఈ ప్రకటనను బట్టి చూస్తే హాకింగ్ కి పాల్పడిన వారి లో భారతీయ మూలాలు ఖచ్చితంగా ఉంది ఉంటాయని భావిస్తున్నారు.

ఆ ముగ్గురు సస్పెండ్ : Those three are suspended

భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యాటకు వెళ్లారు. తన పర్యటన సందర్భంగా మోదీ ఆ ప్రాంతంలో పర్యాటకాన్నికూడా ప్రమోట్ చేసేశారు.

అయితే మోదీ లక్షద్వీప్ ను ప్రోత్సహిస్తున్న వీడియోకు రెస్పొంద్ అయిన మాల్దీవ్స్ యువజన మంత్రిత్వ శాఖకు (Ministry of Youth) చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు,

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో అవమానకరమైన చేశారు. అప్పటి నుండి రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత ఏర్పడింది. ఈముగ్గురు,

అంటే డిప్యూటీ మంత్రులు మరియం షియునా(Mariam Shiuna), మల్షా(Malsha) అలాగే హసన్ జిహాన్‌ల(Hassan Jihan) పట్ల ప్రజల వ్యతిరేకత తీవ్రమైంది, అందుకే అక్కడి ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఇక భారతదేశంలోని మాల్దీవుల హైకమీషనర్ ఇబ్రహీం షహీబ్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు.

Leave a Comment