Mamata Banerjee – Change Bengal Name: పేరు మార్చండి రాత మారుతుంది

website 6tvnews template 26 Mamata Banerjee - Change Bengal Name: పేరు మార్చండి రాత మారుతుంది

Mamata Banerjee – Change Bengal Name: పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్య మంత్రి మమతా బెనర్జీ(CM Mamatha Banerjee) ఒక కొత్త ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇది అంత సరికొత్త ప్రతిపాదన కాకపోయినప్పటికీ కొంత మంది దృష్టిలో ఇది కొత్త ప్రతిపాదన గానే ఉండొచ్చు.

కొత్తదా, పాతదా అన్న విషయాన్నీ కాస్త పక్కన పెడితే ఆమె తీసుకొచ్చిన ప్రతిపాదన ఏమిటంటే, తమ రాష్ట్రం పేరు మార్చాలని. ఇప్పటి వరకు తమ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్ అని పేరు ఉంది. ఇంగ్లిష్ లో రాస్తే దాని పేరు వెస్ట్ బెంగాల్ అవుతుంది.

అంటే ఆల్ఫా బెటిక్ ఆర్డర్ చుస్తే వెస్ట్ బెంగాల్ మన దేశంలోని రాష్ట్రాల లిస్ట్ ను తయారు చేసినప్పుడు చివర్లో ఉండాల్సి ఉంటుంది.

దీని వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అంటోంది ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో ఉన్న పశ్చిమ ను తీసివేసి కేవలం బెంగాల్ అని మాత్రమే పెడితే సరిపోతుందని అంటున్నారు మమతా బెనర్జీ.

కారణం ఏమిటంటే : Reason Behind The Demand

west bengal state location within india 3d map vector Mamata Banerjee - Change Bengal Name: పేరు మార్చండి రాత మారుతుంది

బెంగాల్(Bengal) అని ఉండటం వల్ల కలిగే లాభాన్ని, పశ్చిమ బెంగాల్(West Bnegal) అని ఉండటం వల్ల వచ్చే నష్టాన్ని దీదీ చాలా చక్కగా వివరించారు.

ఏవైనా సమావేశాలకు వెళ్లిన సమయంలో జాబితా ప్రకారం పిలుస్తున్నారట. దాని వల్ల ఆ రాష్ట్రం వంతు వచ్చేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.

ఈ ప్రపంచమే పోటీ మయం గా మారిపోయింది, ఇలాంటి సమయంలో పలు పోటీల్లో పాల్గొన్న తమ రాష్ట్ర యువతకు ఆఖరున ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. కేవలం తమ రాష్ట్రం లో ఉన్న పశ్చిమ అనే పేరు ఉండటం వల్లనే, యువత ప్రతి సారి, చివరి వరకు ఎదురు చూడాల్సి వస్తోందని అంటున్నారు.

అన్ని క్లియర్ అయినా లేట్ : Mamatha Fires About Delay

తమ రాష్ట్రానికి పేరు మార్చే విషయంలో తాము చాలా క్లియర్ గా ఉన్నామని, పశ్చిమ బెంగాల్(west Bengal) లోని పశ్చిమ ను తొలగించి, బెంగాల్ స్టేట్ గా(Bengal State) మార్చుకోవడానికి సిద్ధమయ్యామని చెప్పారు. ఈ వ్యవహారంలో తమ రాష్ట్ర అసెంబ్లీలో గతంలోనే బిల్లును ఆమోదించుకున్నామని గుర్తుచేశారు.

పేరు మార్పుకి సంబంధించి అన్ని విషయాల్లో స్పష్టతను ఇచ్చినప్పటికీ జాప్యం ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రాలకు పేర్లు మార్చడం అనేది కొత్తగా కేవలం తమ రాష్ట్రంతో మొదలైంది కాదని అన్నారు.

గతంలో కొన్ని రాష్ట్రాలు, నగరాల పేర్లు మార్చిన విషయాన్నీ మమతా ఉటంకించారు. బాంబే గా(Bombay) ఉన్న పేరును ముంబై గా(Mumbai) మార్చారని, అలాగే ఒడిస్సా(Odissa) ను ఒరిస్సా గా(Orissa) మార్చారని చెప్పారు. కానీ తమ రాష్ట్రం పేరును ఎందుకు మార్చడం లేదో తమకు అర్ధం కావడం లేదన్నారు, ఇందులో తాము చేసిన తప్పేంటో తెలియడం లేదని చెబుతున్నారు.

అయితే పేరు మార్చే విషయం లో మమత, కేంద్రానికి ప్రతిపాదన పంపించడం కొత్తేమి కాదు 2011 లో అధికారం చేపట్టిన సమయంలో ఆమె పశ్చిమ బెంగాల్ పేరును పశ్చిమ బెంగ(West Banga) అని మార్చాలంటూ ప్రతిపాదన చేశారు. కానీ ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

Leave a Comment