Manchu Vishnu’s wonderful gift to Mrs: శ్రీమతికి మంచు విష్ణు అపురూప కానుక..మురిసిపోతున్న విరానికా.
మంచు విష్ణు ఎలాగైనా భారీ సక్సస్ అందుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు. తన తండ్రి మోహన్ బాబు, తన తమ్ముడు మనోజ్ వరుణ్ సందేశ్ తనీష్ లతో కలిసి చేసిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమా తరువాత ఆయనకు ఆ స్థాయి హిట్టు పడనే లేదు.
కేవలం విష్ణుకి మాత్రమే కాదు మంచు ఫ్యామిలీ మొత్తం కూడా అసలు సిసలు సక్సస్ అందుకుని ఏళ్ళు గడిచి పోతోంది. హిట్ సినిమా అనే పేరు ఆ కాంపౌండ్ లో వినపడక దాదాపు దశాబ్దం అవుతోంది.
అందుకే ఎలాగైనా భారీ హిట్టు కొట్టి ట్రోలర్స్ నోరు మూయించాలని ఫిక్స్ అయ్యాడు మంచు విష్ణు. ఆ క్రమంలోనే భక్త కన్నప్ప అనే సినిమాను ఎంచుకున్నాడు.
ఇది విష్ణు కల ప్రాజెక్టు, చాలా కాలం నుండి దీని మీద విష్ణు కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో నటించేందుకు పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ను రెడీ చేశాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్,
అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో వివిధ పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా మరికొంత మంది నటులు కూడా ఈ సినిమా కోసం మేకప్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారట.
ఒకప్పుడు ఇదే భక్త కన్నప్ప సినిమాను రెబల్ స్టార్ కృష్ణం రాజు చేశారు. కృష్ణం రాజు కూడా గోపి కృష్ణ పథకం పై ఆ సినిమాను సొంతంగా నిర్మించారు. ఆ సినిమాలో కూడా అప్పటికి బిజీ ఆర్టిస్టులనే ఎంపిక చేశారు.
కథానాయికగా వాణిశ్రీ, ప్రధాన ప్రతినాయకుడిగా రావుగోపాలరావు, శివుడిగా బాలయ్య, అల్లు రామలింగయ్య, శ్రీధర్, ప్రభాకర్ రెడ్డి, జయమాలిని వంటి హేమా హేమీలు నటించారు. అయితే ఇప్పుడు విష్ణు నిర్మిస్తున్న సినిమాలో కూడా పెద్ద స్థాయి నటీనటులనే ఎంచుకుంటున్నారు.
కాసేపు సినిమా విషయాలను పెక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కి చిత్ర బృందం న్యూజిలాండ్ వెళ్ళింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు తోపాటు అతని భార్య విరానిక కూడా అక్కడే ఉన్నారు.
అయితే షూటింగ్ గ్యాప్ లో బయట విహరించడానికి వెళ్ళింది ఈ జంట. ఆ క్రమంలో రోడ్డు పక్కనే ఆకర్షణీయంగా కనిపించిన పువ్వులను తన భార్య కోసం తెంపుకుని తీసుకొచ్చాడు మంచు విష్ణు, ఆ పువ్వులు విలువ ఎంత తక్కువైనా ప్రేమగా చూసుకునే భర్త తెచ్చి ఇవ్వడంతో
అవి భార్యకు చాలా అపురూపమే అవుతాయి. అన్నక్యూకే విరానిక ఆ పువ్వులను విష్ణు తీసుకుని వస్తున్నా వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేసుకుంది.
అన్నట్టు మంచు విష్ణు ఈ సినిమాను న్యూజిలాండ్ లో తెరకెక్కించడానికి కారణం కూడా ఉంది. న్యూజిలాండ్ లో సహజసిద్ధమైన ప్రక్రుతి అందాలు కనువిందు చేస్తాయి.
అలంటి ప్రాంతంలో సినిమాను తెరకెక్కిస్తే తెరపై చూసేవారికి కనుల విందుగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు విష్ణు. ఇక అంతటి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తే శ్రీమతి తో విహారానికి వేళ్ళని శ్రీవారు ఉంటారా ? అందుకే విష్ణు కూడా సతీ సమేతంగా అలా విహారానికి వెళ్ళాడు.