Mangalavaaram Movie story : మంగళవారం సినిమా స్టోరీ ఏంటంటే..మంగళవారం సినిమాలో విలన్ ఎవరో ఊహించగలరా..
మంగళవారం సినిమా శుక్రవారం విడుదలైంది. ఇదేంటి, మంగళవారం నాడు విడుదల కావలసింది శుక్రవారం విడుదలైంది అనుకుంటున్నారా.. లేదండి, డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా పేరు మంగళవారం ఆ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది, మరి ఆ సినిమా కధ ఏంటి, ఎనిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది వంటి వివరాలు చూద్దాం..
మహాలక్ష్మీపురం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఈ కధ మొత్తం కూడా 80, 90 దశకం నేపథ్యంలోనే ఉంటుంది. ఊర్లో రవి, శైలు అనే ఇద్దరు బాల్య స్నేహితులు ఉంటారు, శైలు అనే పాత్రను పాయల్ రాజపుత్ పోషించింది. వారి చిన్నతనంలో ఓ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటుంది, ఆప్రమాదంలో రవి మరణించాడని అనుకుంటుంది శైలు, కొన్నేళ్ల తరువాత ఆ ఊర్లో ప్రతీ మంగళవారం కొన్ని చావులు సంభవిస్తుంటాయి. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ చావులు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారివే అయి ఉంటాయి, అక్రమ సంబంధం నెరుపుతున్న వారి పేర్లు తెల్లవారేసరికి గోడ మీద రాసి ఉంటుంది, ఆ తరువాతి రోజు వారు చనిపోయి ఉంటారు. ఇలా వారి పేర్లను ఊరి గోడల మీద రాస్తున్నది ఎవరు ? అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని చంపుతోంది ఎవరు అని ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆఊరి కి మాయా అనే ఎస్సై కొత్తగా వస్తుంది. ఆమె ఈ హత్యల విషయంలో ఊరి పెద్ద, జమిందారు ప్రకాశం బాబు, వాసు, కసిరాజు, గురజ, ఆర్ఎంపీ విశ్వనాథం, వంటి కొంత మందిని తన వృత్తిలో భాగంగా అనుమానిస్తూ ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ హత్యల విషయంలో ఊరి జనాలు ఎస్సై మాయ మీద అనుమానపడతారు. ఇది ఇలా ఉండగా శైలు జీవితంలోకి కొత్తగా మదన్ అనే వ్యక్తి వస్తాడు, అసలు మదన్ ఎవరు ? ఈ చావుల వ్యవహారం ఏమిటి ? శైలుకి ఏదైనా సమస్య ఉందా ? ఉంటె ఆసమాస్య ఏంటి ? జమీందారు భార్య ఎం చేసింది ? ఊరి జనాలు శైలుని ఏం చేశారు? అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మీరు తప్పక ఈ సినిమాను థియేటర్ లో చూడాల్సిందే.
సాధారణంగా 1980 టైం లో కొన్ని సినిమాలు వచ్చేవి, వాటిలో ఒక ఊరిలో హత్యలు జరుగుతూ ఉంటాయి, ఆ ఊరి జనాలు ఎప్పుడు ఎవరు చనిపోతారా అని భయపడుతూ ఉంటారు, ఊరి పెద్దలు ఎవరో ఒకరిని అనుమానిస్తూ ఉంటారు, కానీ సినిమా చివరి వరకు అనుమానాస్పదంగా ఉండేవారేమో మంచివారవుతారు, అప్పటివరకు మంచివారు ఉన్నవారేమో హత్యలు చేసేవారిగా తెలిసిపోతుంది. దీనినే మరోసారి చూపెట్టాడు అజయ్ భూపతి, ఎంతైనా రాం గోపాల్ వర్మ శిష్యుడు కాబట్టి కాస్త కొత్తగా చూపిద్దాం అనుకుని ట్రై చేశాడు కానీ అంత కొత్తగా ఏమి చూపెట్టలేకపోయాడు. థియేటర్ లో ఎవరు విలనో ప్రేక్షకుడు ఊహించే విధంగానే ఉంటుంది మూవీ. ప్రధాన పాత్ర పోషించిన పాయల్ పడే బాధను ప్రేక్షకులకు ఇంకాస్త కనెక్ట్ చేసిఉంటే సినిమా మరింత రక్తి కట్టేదేమో అనిపిస్తుంది. మంగళవారం సినిమా కొద్దిగా బోర్ ఫీలింగ్ తో సాగినప్పటికీ చివరకు మాత్రం బాగానే తీశాడు దర్శకుడు అనిపించుకున్నాడు. ఆర్ఎక్స్ 100లో మాదిరిగానే ఇందులో కూడా మహిళే విలన్, మహిళలను నెగెటివ్‌గా చూపిస్తే హిట్టు పక్కా అని ఫిక్సయ్యాడా అజయ్ అనిపిస్తుంది మంగళవారం సినిమా చుస్తే, మంగళవారం విజువల్స్, ఆర్ఆర్, వేరే లెవెల్ లో ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఆర్ఆర్ వెన్నుముక అని చెప్పొచ్చు. థియేటర్ లో అజనీష్ ఆర్ఆర్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సెకండాఫ్ నీరసంగా సాగినప్పటికీ ప్రీ క్లైమక్స్, క్లైమక్స్ సన్నివేశాలు అబ్బురపరుయిస్తాయి, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ఒకే రకమైన హావభావాలు చూపించింది. ఎప్పుడూ ఏడుస్తూ కనిపించే పాత్ర కావడం తో పెద్ద గా వ్యత్యాసం కనిపించదు ఆమె నటనలో. శ్రీతేజ్, అజ్మిల్, శ్రావణ్ రెడ్డి,అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్ లు తమ పరిధి మేరకు నటించి సన్నివేశాలను రక్తి కట్టించారు.