Aditi Rao Hydari : చీరకట్టులో మణిరత్నం హీరోయిన్ మెరుపులు.
Aditi Rao Hydari మణిరత్నం హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మలయాళ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ బాలీవుడ్, టాలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తోంది.
సినిమాల విషయంలోనే కాదు మీ అమ్మడి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. Aditi Rao Hydari తన అద్భుతమైన,
అసాధారణమైన దుస్తుల ఎంపికలతో ఎప్పుడూ ఫ్యాషన్ గేమ్ లో ముందువరుసలో ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఉత్కంఠభరితమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులను అలరించే నటి అదితి .
Aditi Rao Hydari సొగసైన చీరలు, లెహంగాలను ధరించి భారతీయ కట్టు బొట్టుకు, దేశీయ దుస్తులకు రాణిగా పేరు సంపాదించుకుంది. ఈ నటి ధరించే ఎత్నిక్ వేర్ అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి.
తాజాగా ఈ చిన్నది ఏస్ ఫ్యాషన్ డిజైనర్ Sabyasachi డిజైనర్ షెల్ఫ్‌ల నుండి చీరను ఎన్నుకుని మరోసారి ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.
Aditi Rao Hydari ఎలాంటి రూపంలో అయినా అద్భుతంగా కనిపిస్తుంది.తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం అదితి నలుపు రంగు చీరను ఎన్నుకుంది. మెరుపుల వివరాలతో అలంకరించబడిన నల్లని చీరకు ఇంట్రియాక్ట్ హ్యాండ్ వర్క్ డీటైలింగ్‌తో అలంకరించిన భారీ అంచు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.
ఈ షిమ్మరీ శారీ కి మోచేతి పొడవు గల స్లీవ్స్ వచ్చిన మల్టీ కలర్ బ్లౌజ్ ను జోడించింది ఈ రాయల్ బ్యూటీ. అబ్బురపరిచే sabyasachi చీరలో అదితి రావ్ హైదరీ అందాలు రెట్టింపు అయ్యాయి. ఈ లుక్ లో వివాహ సీజన్ కోసం ఎత్నిక్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది.
ఈ చీరకు తగ్గట్లుగా చెవులకు ఒక జత ఎమరాల్డ్ గోల్డ్ స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ అలంకరించుకుంది. కాళ్లకు హైహీల్స్ వేసుకుంది.
రాయల్ బ్యూటీ ఈ చీరలో ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోలను ఈ చిన్నది తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నటి తన లుక్ తో అభిమానులను అట్రాక్ట్ చేసింది.
అదితి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఆమె ఇన్‌స్టా-డైరీలు, అద్భుతమైన ఎథ్నిక్ లుక్‌లతో నిండి ఉంటాయి. ఈ ఎత్నిక్ లుక్స్ వివాహ సీజన్ కు ఫ్యాషన్ స్ఫూర్తికి అందిస్తాయి.
లేటెస్ట్ గా కట్టుకున్న చీరతోనూ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది ఈ చిన్నది. ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ sanam ratansi నటి Aditi Rao Hydari కి స్టైలిష్ లుక్స్ అందించింది. మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా అదితి అందాలకు మెరుగులు దిద్దింది.
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన అదితీరావ్ సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది . ఆ తర్వాత తెలుగులో నాని వీ, మహా సముద్రం మూవీస్ చేసింది.
ఈ మూడు సినిమాలు అదితికి మంచి గుర్తింపును అందించాయి. ప్రస్తుతం తమిళంలో vijay sethupathi తో gandhi talks అనే మూవీ చేస్తోంది.
Bollywood లో sanjay leela bhansali మూవీ Hiramandi లో కనిపించనుంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఈ భామ డేటింగ్‌లో ఉన్నట్లు పూకార్లు వస్తున్నాయి.
మహాసముద్రం మూవీ తర్వాత ఈ ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. అయితే వీటిపై ఈ ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.