Manisha Koirala: నా మొగుడే..నా శత్రువు

WhatsApp Image 2024 03 18 at 3.13.15 PM Manisha Koirala: నా మొగుడే..నా శత్రువు

మనీషా కోయిరాలా (Manisha Koirala).. ఈ పేరు వినగానే ఆమె అందం కళ్ల ముందు కదలాడుతుంది. అప్పట్లో తన గ్లామర్ తో , యాక్టింగ్ తో ఇండస్ట్రీని ఓ రేంజ్ లో షేక్ చేసేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి అందరి మనసులను దోచేసింది మనీషా కొయిరాలా. ఆమె నటించిన సినిమాల్లో ఒకే ఒక్కడు (Oke Okkadu), బొంబాయి (Bombay)సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.

తెలుగులోనూ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమాల్లోనే కాదు టీవీలోనూ తన టాలెంట్ చూపించింది మనీషా. తాజాగా పలు వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీలో మనీషా తిరుగులేని యువరాణి అయినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆమె వివాహ బంధం మూనాళ్లకే ముక్కలైంది. తాజాగా మనీషా తన పెళ్లి, భర్త గురించి షాకింగ్ విషయాలను పంచుకుంది. తనలోని బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

మూడేళ్లకే భర్తతో విడాకులు :

మనీషా కొయిరాలా (Manisha Koirala) స్టార్ హీరోయిన్ అయినా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి పోరాడి బయటపడింది. అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది మనీషా. అయితే ఇండస్ట్రీలో మాత్రం మనీషా గురించి ఎన్నో రూమర్స్ చెక్కర్లు కొట్టాయి .

WhatsApp Image 2024 03 18 at 3.13.44 PM Manisha Koirala: నా మొగుడే..నా శత్రువు

ఆమెకు చాలా మంది స్టార్ సెలబ్రిటీలతో అఫైర్స్ ఉన్నాయంటూ అప్పట్లో వార్తలు షికారు చేశాయి. స్టార్ హీరోలతో ప్రేమాయణం సాగించినా అవి పెళ్లివరకు దారి తీయలేదని టాక్ కూడా వినిపించింది. చివరకు మనీషా 2010న నేపాల్ కు చెందిన బిజినెస్ మెన్ సామ్రాట్ దహల్‌ (Samrat Dahal)ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి సంబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. అప్పట్లో ఆమె డివోర్స్ న్యూస్ పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇక అదే మనీషా చేసిన పెద్ద తప్పు. స్వయంగా మనీషానే ఈ విషయాన్ని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

నా భర్తే నా శత్రువు :

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మనీషా తన మాజీ భర్త గురించి,డివోర్స్ గురించి తెలిపింది. ” నా లైఫ్ లో నేను లవ్ చేసిన వ్యక్తి ఒకరే. పెళ్లైన ఆరునెలలకే నా భర్త నాకు శత్రువయ్యాడు. ఇంతకుమించిన దురదృష్టం ఏ స్త్రీకి ఉంటుంది”. అని మనీషా ఇచ్చిన ఎమోషనల్ స్టేట్మెంట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

లెజెండరీ నటుడితో అఫైర్ :

అప్పట్లో లెజెండరీ హీరో నానా పటేకర్‌ (Nana Patekar)తో మనీషా (Manisha Koirala)కు ఎఫైర్ ఉందంటూ ఇండస్ట్రీలో పుకార్లు వచ్చాయి. అయితే నానా పటేకర్‌కి అప్పటికే వివాహమైంది. ఆయనే కాదు వివేక్ ముశ్రన్ (Vivek Mushran), డీజే హుస్సేన్ (DJ Hussain), సిసిల్ ఆంథోనీ ( Cecil Anthony), ఆర్యన్ వేద్ (Aryan Ved,), ప్రశాంత్ చౌదరి(Prashant Chaudhary), క్రిస్పిన్ కాన్రాయ్, తారిక్ ప్రేమ్‌జీ, రాజీవ్ మూల్‌చందానీ (Rajeev Moolchandani ),క్రిస్టోఫర్ డోరిస్‌లతో మనీషా ప్రేమాయణం సాగించిందన్న టాక్ వినిపించింది. అయితే ఆ వర్తలో ఎంత నిజం ఉందన్నది ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుతం మనీషా మాత్రం వరుస సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో టచ్ లో ఉంటోంది.

Leave a Comment