Mansoor ali chiranjeevi controversy : మన్సుర్ మళ్ళీ వివాదంలోకి : ఒకసారి క్షమాపణ, మరోసారి పరువు నష్టం దావా!
కొద్ది రోజులుగా మున్సుర్ అలీ ఖాన్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాడు.. నటి త్రిష పైన ఇటీవల అతను చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల గురించి సమర్దించుకోవడానికి ముందుగా ప్రయత్నించాడు కానీ విషయం అప్పటికే విషమించడంతో ఇక చేసేదేం లేక త్రిషని పబ్లిక్ గా క్షమాపణ కోరాడు. అది కూడా పోలీసులు నోటీసులు పంపించిన తర్వాత.
అయితే ఈ విషయంలో త్రిషకి మద్దతుగా చిరంజీవి, ఖుష్బూ మున్సుర్ ని విమర్శించారు. చిరంజీవి అయితే, ” వక్ర బుద్ది ఉన్నవాళ్ళు అలాంటి వ్యాఖ్యలే చేస్తార”ని కాస్త ఘాటు గానే స్పందించాడు.
అయితే ఈ వివాదంలో ” చిరంజీవి అసలు విషయం తెలుసుకోకుండా తనని విమర్శించాడని, అసలు ఏం జరిగింది అని ఒక్క మాట ఫోన్ చేసి ఆడగాల్సింద”ని మున్సుర్ అలీ ఖాన్ అన్నారు.
అంతటితో ఆగకుండా చిరంజీవి పైన వివాదాస్పదమైన వ్యాఖ్యాలు చేశాడు.
” నాది వక్ర బుద్ది అన్న ఆయన చేసిన పనులేంటి? నాకు తెలీదా?
ఆయన పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించుకున్నాడాని, ఏ పేద వారికి కూడా సహాయం చేయలేద” ని అన్నారు. ఇంకా ”హీరోయిన్లతో ఎప్పుడు పార్టీలు చేసుకుంటాడని, ఆయన ఎప్పడూ అమ్మాయిలనే పార్టీలకు పిలుస్తాడని, అసలు తననెప్పుడు పిలవలేదని, అయిన అది ఆయన వ్యక్తిగతం” అంటూ వ్యంగ్యంగా విమర్శించాడు.
”ఇండస్ట్రిలో ప్రముఖుడై కూడా ఆలోచన లేకుండా చేసిన వ్యాఖ్యలు అస్సలు సరైనవి కావ”ని అన్నాడు
ఇక ”త్రిష, ఖుష్భు లతో పాటు చిరంజీవి పైన కూడా పరువు నష్టం దావా వేస్తాన”ని పేర్కొన్నాడు. ”త్రిష పైన 10 కోట్లు, ఖుష్భు పైన 10 కోట్లు, చిరంజీవి పైన ఏకంగా 20 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని, ఆ వచ్చిన దబ్బుని తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబానికి ఇస్తాన”ని అన్నాడు.