Mansoor Ali Khan case on Chiru: చిరు పై మన్సూర్ కేసు..మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు.

Mansoor's case on Chiru.. Petition filed in Madras High Court.

Mansoor Ali Khan case on Chiru: చిరు పై మన్సూర్ కేసు..మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు.

చాల కాలం తరవాత కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మునుపటి మాదిరిగా క్రేజ్ సంపాదించుకున్న నటి త్రిష, అయితే మునుపటి కన్నా ఇప్పుడే వివాదాలను కూడా కొనితెచ్చుకుంటోందని కూడా చెప్పాలేమో.

సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చేసే మన్సూర్ లై ఖాన్ ఓకే ఆఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు స్పందించి వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

ఆ వ్యాఖ్యలకు త్రిష స్పందించడంతో మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో, త్రిషతో రేప్ సీన్ చేయలేకపోయినందుకు డిజప్పాయింట్ అయ్యానని చెప్పిన విషయం ఎక్కువ మందికి కూడా తెలిసేది కాదేమో.

ఇది ఇలా ఉంచితే త్రిష కి అవమానం జరిగింది అంటూ కుష్బూ కూడా స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ పై మహిళా కమిషన్ తరుపున పోలీస్ కేసు పెట్టేలా కూడా చేశారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి కూడా త్రిష విషయంలో గట్టిగానే రెస్పాండ్ అయ్యారు.

మునుపెన్నడూ లేనంతగా మెగాస్టార్ ఫైర్ అయ్యారు మన్సూర్ మీద. ఎట్టకేలకు మన్సూర్ త్రిష కి క్షమాపణ అయితే చెప్పాడు కానీ త్రిష, కుష్బూ, మెగాస్టార్ చిరు మీద మాత్రం కోపం పెంచుకున్నాడు.

అసలు తాను ఏ సందర్భంలో అలా మాట్లాడానో తెలుసుకోకుండా చిరంజీవి అలా మాట్లాడి ఉండకూడ ఉంటె బాగుండేది అన్నారు. చిరంజీవి కి తనతో మాట్లాడే చనువు కూడా ఉందని, ఒక్క ఫోన్ చేసి జరిగిన విషయం ఏమిటో అడిగి ఉంటె బాగుండేదని అన్నాడు.

అలా కాకుండా తన ఇష్టానికి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం తన స్టేటస్ కి భంగం కలిగించిందని భావించాడు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు కుష్బూ కూడా త్రిష ఉదంతంలో ఘాటుగానే స్పందించింది.

మన్సూర్ ను ఒక రేంజ్ లో తూర్పారబట్టింది. అందుకే త్రిష, కుష్బూ, చిరంజీవి ముగ్గురి మీదా మన్సూర్ పరువు నష్టం దావా వేస్తానని అన్నాడు. ఆమాట ప్రకారమే తాజాగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు మన్సూర్ అలీ ఖాన్.

ఇది ఇలా ఉంటె చిరంజీవి కుష్బూ మంచి స్నేహితులు, వీరు 80’s రీయూనియన్ పేరుతో ప్రతి ఏడాది కలుస్తుంటే ఉంటారు. ఒకే దశాబ్దంలో ఒక సంవత్సరం అటు ఇటు గా కెరియర్ మొదలు పెట్టిన నటీనటులంతా ఈ రీయూనియన్ గ్యాంగ్ లో పాలు పంచుకుంటారు.

ఇక త్రిష విషయానికి వస్తే చిరు త్రిష ఇద్దరు కూడా స్టాలిన్ అనే సినిమాలో నాయకా నాయికలుగా ఆడిపాడారు. అదే సినిమాలో చిరుకి కుష్బూ అక్కగా నటించింది. కాబట్టి వీరి ముగ్గురా మధ్య మధ్య మంచి స్నేహం ఉంది ఉండొచ్చు.

Leave a Comment