Bigg Boss Telugu 7 Winner: ఎన్నో అవమానాలు..నవ్విన నోళ్లను మూయించిన రైతుబిడ్డ.

Many insults..a peasant boy who closed his smiling mouth.

Bigg Boss Telugu 7 Winner: ఎన్నో అవమానాలు..నవ్విన నోళ్లను మూయించిన రైతుబిడ్డ.

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ను గెలుచుకుని రైతు బిడ్డ సత్తాను చూపించాడు. దేశ చరిత్రలో ఒక సామాన్య పౌరుడు బిగ్ బాస్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి.

బిగ్ బాస్ గేమ్ ప్రారంభం నుంచి టైటిల్ విన్ అయ్యే వరకు ప్రతి ఛాలెంజ్ లో తన ప్రతిభను చూపించి సెలబ్రిటీలకు సైతం చుక్కలు చూపించాడు పల్లవి ప్రశాంత్.

వాడీ వేడిగా సాగిన ఈ టైటిల్ పోరులో చివరకు విన్నర్ గా నిలిచి తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. “అన్నా మల్లొచ్చినా.. అన్నా రైతు బిడ్డనన్నా..

అన్నా నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండన్నా “అని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా అకౌంట్లో వీడియోలు పెడుతుంటే వీడెవడ్రా బాబూ.. పిచ్చోడిలా ఉన్నాడే.. అని అందరూ హేళన చేసేవారు. నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్లడమేంటని ఎంతో మంది అవమానించారు. ఆ వీడియోలు తీయడం ఆపేసి..

బుద్దిగా వ్యవసాయం చేసుకుని బతకమని చాలా మంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయినా ఎక్కడా తన ప్రయత్నాలు ఆపలేదు. ఎలాగైనా బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

ఎంత మంది హేళన చేసినా పట్టించుకోలేదు. నన్ను చూసి నవ్వుకుంటే నవ్వుకోనీలే అని వదిలేశాడు. కానీ ఇప్పుడు ఆ నవ్విన నోళ్లో నోరెళ్ళబెట్టేలా చేశాడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిట్‏ను సాధించి రైతు బిడ్డ తలెత్తేలా చేశాడు.

‘మీరు నవ్వినా.. నన్ను చూసి హేళన చేసినా.. నా టార్గెట్ బిగ్ బాస్ మాత్రమే.. గుర్తుపెట్టుకోండి.. నా గురి ఏమాత్రం తప్పదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి కచ్చితంగా అడుగుపెట్టి తీరుతా’ అని శపథం చేశాడు.

అన్నట్టుగానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యాడు. తనతో పాటు హౌస్ లోకి వచ్చిన 18 మంది కంటెస్టెంట్‌లతో పోటీపడ్డాడు. తానేంటో బిగ్ బాస్ వేదికగా నిరూపించాడు.

నవ్విన నోళ్లే మూతపడేలా.. తన గెలుపుతో అందరూ అవాక్కయ్యేలా చేశాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా , ఓ సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రశాంత్..

టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీని రైతులకే ఇస్తానని అనౌన్స్ చేసి అందరినీ మనసులను గెలుచుకున్నాడు.ఇక ఫినాలేలో నాగార్జున బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్

అని అనౌన్స్ చేయగానే పల్లవి ప్రశాంత్ ఆయన కాళ్లపై పడి భోరున ఏడ్చేశాడు. ఆ తర్వాత మాట్లాడుతూ..

“నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీ అందరికీ ఒకటి చెప్పాలి. మొదట సార్ గురించి చెబుతాను..నేను ఎన్నో రోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకున్నాడు.

ప్రతిరోజు ఇక్కడిక్కడే తిరిగాను. కొన్ని రోజులు భోజనం తినని రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడినా నా కుటుంబానికి తెలియనివ్వలేదు. ఇంట్లో వాళ్లకి తిన్నాను మంచిగా ఉన్నానని అబద్దం చెబుతూ వచ్చాను.

కానీ నాకు నమ్మకముంది. నేను ఎలాగైనా హౌస్ లోకి వెళతానని బాపుకి చెప్పినా.. బిడ్డా నువ్వు ఏది అనుకుంటే అది చేస్తావ్.. నాకు నమ్మకం ఉందన్నారు.

నువ్వు ముంగటికి నడువు.. నడిపిస్తా అని మాటిచ్చిండు.. ఆ మాటే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. నాగార్జున సార్‌ పరిచయం అయ్యేలా చేసింది. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టేలా చేసింది.

నేను హౌస్ లోకి ఎంటర్ అయ్యాక చెప్పినట్లుగానే.. నాకు వచ్చిన ప్రైజ్ మనీ 35 లక్షలు రైతులకు ఇస్తానని మాటిచ్చినా. నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా..

కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్లి వారి డబ్బు అందించి వారి కష్టాలు తీర్చుతాను. ఈ విషయంలో మాట తప్పేదే లేదు.. జై జవాన్ జై కిసాన్..నేను రైతుల కోసమే బిగ్ బాస్ కు వచ్చిన.

వారి కోసమే గేమ్ ఆడిన.. నాకు ఎంతో సంతోషంగా ఉ:ది. నేను గెలుచుకున్న కారు మా బాబుకి.. బంగారం అమ్మకి ఇస్తా.. డబ్బు మాత్రం రైతులకు అందిస్తా . థాంక్యూ సో మచ్ సార్” అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.

Leave a Comment