Mass Maharaja Ravi Teja enter the multiplex business : ఈ మధ్యన టాలీవుడ్ స్టార్స్ లో అగ్ర హిరోలు అందరు ఒకరు తర్వాత ఒకరు దియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టి లాభాలు గడిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు,బన్నీ లు ఈ బిజినెస్ లో ఉన్నారు. మహేష్ బాబు అయితే ఏఎంబీ పేరుతో మల్టి ఫ్లెక్స్ ధీయేటర్ ప్రారంబించి సక్సెస్ ఫుల్ రన్ చేస్తున్నారు. మహేష్ ఇన్స్పిరేషన్ తో బన్ని కూడా ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. అల్లు అర్జున్ పేరు వచ్చేల ఏఏ పేరు తో దియేటర్ నిర్మించాడు. ఇదే బిజినెస్ లోకి విజయ దేవరకొండ కూడా దిగిపోయాడు. వీళ్ళందరిని స్ఫూర్తి గా తీసుకుని ఇప్పుడు మాస్ మహారాజ రవి తేజ కూడా ఈ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు.
దియేటర్ పేరు ఏషియన్ రవితేజ :
మాస్ మహారాజ నిర్మించ బోయే మల్టి ఫ్లెక్స్ దియేటర్ హైదరాబాద్ దిల్షుక్ నగర్ ప్రాంతం లో నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ దియేటర్ కు ఏషియన్ రవితేజ పేరు కలిస్ వచ్చేల ఏ ఆర్ టీ సీనిమాస్ అని పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మల్టి ఫ్లెక్స్ దియేటర్ లో మొత్తం 6 స్క్రీన్లు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం లో ఈ దియేటర్ ప్రారంభం అవుతున్నట్లు సమాచారం ఉంది. ప్రఖ్యాత మల్టి ఫ్లెక్స్ సంస్ద అయిన ఏషియన్ సినిమా సంస్ద తో కలిసి ఈ దియేటర్ ను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం గురుంచి తొందరలోనే రవితేజ అఫీషియల్ గా అనౌన్సు చేయబోతున్నట్లు సినివర్గాల ప్రముఖుల నుండి అందుతున్న సమాచారం ఉంది.