ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో అగ్ని ప్రమాదాలు తరచుగా సంభవిస్తూనే ఉన్నాయి. గత నెలలో కూడా కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా కూడా ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మింట్ కాంపౌండ్ లో ఈ ప్రమాదం వెలుగు చూసింది.
ప్రభుత్వ పుస్తక ముద్రణ కార్యాలయంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అసలే పుస్తకాల ముద్రణ కేంద్రం కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.(Massive Fire Accident In Mint Compound) ఈ అగ్ని ప్రమాదం లో పుస్తకాలతోపాటు ముద్రణ యంత్రాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ ఘటనపై స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు పోలీసులు కూడా ప్రమాద స్థలికి చేరుకున్నారు.
అగ్నిప్రమాదానికి కారణం ? Reason For Fire Accident
ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదాన్ని తప్పించినట్టయింది. ఏమాత్రం ఆలస్యమైనా అగ్నికీలలు పక్కన ఉన్న భవనాలకు వ్యాపించే అవకాశం ఉండేది. ప్రమాదం సంభవించిన సమయం లో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.(Massive Fire Accident In Mint Compound) ఈ ఘటనలో ఆస్తి నష్టమే తప్ప, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు